విద్యుత్ స్తంభాలు ట్రాన్స్ పారాలు రిపేర్ చేసి గ్రామ ప్రజలను రైతులను ఆదుకోవాలి సిపిఎం డిమాండ్
స్వర్ణముఖి న్యూస్, శ్రీకాళహస్తి
అకాల వర్షాల కారణంగా శ్రీకాళహస్తి నియోజకవర్గం లోని అనేక గ్రామాలలో కరెంటు లేక మూడు రోజుల నుండి చీకటి సమయంలో ప్రజలు అవస్థలు పడుతున్నారు అకాల వర్షాలు కురిసి ఇప్పటికి మూడు రోజులు అవుతున్నా ప్రభుత్వం గానీ అధికారులు గాని పట్టించుకోకపోవడం దారుణమని సిపిఎం పార్టీ తిరుపతి జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా వెంటనే కరెంట్ రిపేర్ చేసి గ్రామ ప్రజలను రైతాంగాన్ని త్రాగునీటి సమస్య పరిష్కరించి వెంటనే ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు ఇప్పటికీ అనేక మంది రైతులు వరి నారు పోసి నాటు సిద్ధంగా ఉన్నారు కరెంటు లేకుండా కారణంగా వరి నాట్లు ఎండిపోయే పరిస్థితి ఉన్నాయి అధికారులు అడగ వారం రోజులు పైనే పడుతుంది అని చెప్పి చెబుతున్నారు ప్రభుత్వం వెంటనే స్పందించి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలి లేకపోతే గ్రామ ప్రజలను రైతులను కదిలించి ఏ డి కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు హంగేరి పుల్లయ్య సిఐటియు డివిజన్ కార్యదర్శి పెరగడం గురవయ్య సిపిఎం పార్టీ కార్యదర్శి గంధం మనీ తదితరులు పాల్గొన్నారు
No comments:
Post a Comment