ఫిష్ ఆంధ్ర - ఫిట్ ఆంధ్ర ప్రారంభించిన మంత్రి ఆర్కే రోజా - స్వర్ణముఖి న్యూస్

 స్వర్ణముఖి న్యూస్

NEWS

Breaking

Home Top Ad

Post Top Ad

Thursday, May 5, 2022

ఫిష్ ఆంధ్ర - ఫిట్ ఆంధ్ర ప్రారంభించిన మంత్రి ఆర్కే రోజా

 వడమాలపేట నందు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ మత్స్య శాఖ వారి ఆధ్వర్యంలో లో జరుగు ఫిష్ ఆంధ్ర - ఫిట్ ఆంధ్ర కాన్సెప్ట్ లో బాగంగా రూరల్ ఔట్లెట్ ఫ్రాంచైజీ ను ప్రారంభించిన మన మంత్రివర్యులు శ్రీమతి ఆర్కే రోజా .











ఈ రోజు మన రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక వ్యవహారాల యువజన సర్వీసుల క్రీడా శాఖామాత్యులు మరియు కృష్ణా జిల్లా ఇంఛార్జి మంత్రి వర్యులు  ఆర్కే రోజా  వడమాలపేట నందు మత్స్య శాఖ వారి అనుబంధ ఫ్రాంచైజ్ ఫిట్ ఆంధ్ర - ఫిష్ ఆంధ్ర  రిటైల్ ఔట్లెట్ ను ప్రారంభించారు.


ఈ సందర్భంగా మాట్లాడుతూ..


భారతదేశం నుంచి ఎగుమతి అయ్యే మత్స్య ఉత్పత్తిలో ఆంధ్ర రాష్ట్రం గౌరవ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో 40 శాతం మత్స్య ఉత్పత్తులు మన రాష్ట్రం నుంచే జరగడం గర్వించదగ్గ విషయం అదేవిధంగా మన రాష్ట్రంలో ఉత్పత్తిదారుడు వృత్తిదారులు వినియోగదారుడు ముగ్గురికి లాభం చేకూరే విధంగా ఈ ఫిష్ ఆంధ్ర కార్యక్రమం చేపట్టడం జరిగిందాని,  గత ప్రభుత్వంలో మత్స్య పరిశ్రమ నుంచి వచ్చే ఆదాయం అంతా కూడా వ్యవసాయం తో కలిపి మా హయాంలో  వ్యవసాయం బ్రహ్మాండంగా అభివృద్ధి చెందింది GDP విపరీతంగా పెరిగిందని తెలుగుదేశం ప్రభుత్వం చెప్పుకుంది. కానీ అత్యధిక ఆదాయం ఉన్నటువంటి చేపల పెంపకం చేపల వృత్తిదారుల నే తెలుగుదేశం ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని గుర్తు చేశారు. ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో మత్స్య ఉత్పత్తుల ద్వారా రైతులు , మత్స్యకారులు ఆనందమైన జీవితం గడపాలని తీవ్రమైన  కృషి చేస్తున్నారు అని, వారి కృషి మత్స్యకారుల జీవితంలో వెలుగు నింపిందాని తెలిపారు.


అదేవిధంగా మత్స్యకారుల అందరి తరపున ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేశారు.

No comments:

Post a Comment

Blog Archive

Post Bottom Ad