భారత్ కొత్తగా 2745 కరోనా కేసులు నమోదు
ఇండియాలో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. మంగళవారంతో పోలిస్తే బుధవారం కేసుల సంఖ్య పెరిగింది. అయితే మరణాల సంఖ్య మాత్రం బాగా తగ్గింది. ప్రస్తుతం దేశంలో కరోనా తీవ్రత తక్కువగానే ఉంది.రోజూ వారీ కేసుల సంఖ్య తక్కువగానే నమోదు అవుతోంది. 3 వేలకు లోపు కేసులు నమోదు అవుతున్నాయి. అయితే కొత్తగా వస్తున్న ఓమిక్రాన్ సబ్ వేరియంట్లు బీఏ4, బీఏ 5 లు కలవరపెడుతున్నాయి. ఇప్పటికే ఈ కేసులు హైదరాబాద్, మహారాష్ట్రల్లో బయటపడ్డాయి.
ఇదిలా ఉంటే గడిచిన 24 గంటల్లో ఇండియాలో కొత్తగా 2745 కరోనా కేసులు నమోదు అయ్యాయి. కరోనా నుంచి 2236 మంది కోలుకున్నారు. అయితే గణీనీయంగా మరణాల సంఖ్య తగ్గింది. గడిచిన 24 గంటల్లో 6 మరణాలు మాత్రమే సంభవించాయి. ప్రస్తుతం దేశంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 18,386 గా ఉంది. డెయిలీ పాజిటివిటీ రేటు 0.60శాతంగా ఉంది. ఇప్పటి వరకు ఇండియాలో కోరోనా బారిన పడి కోలుకున్న వారి సంఖ్య 4,26,17,810గా ఉంది. మరణాల సంఖ్య 5,24,636గా ఉంది. దేశంలో అర్హులైన వారికి 197.57 కోట్ల డోసుల వ్యాక్సిన్ ఇచ్చారు.
No comments:
Post a Comment