కార్మికులు,కర్షకులు అందరికి మే డే శుభాకాంక్షలు
స్వర్ణముఖి న్యూస్, శ్రీకాళహస్తి
మే డే సంధర్భంగా ఈ రోజు జనసేన పార్టీ ఆధ్వర్యంలో మునిసిపల్ కార్మికులను కలసి మే డే యొక్క ప్రాముఖ్యత ను,కార్మికుల హక్కులను వివరించడం జరిగింది.ఈ సందర్బంగా జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి కొట్టే సాయి మాట్లాడుతూ నేటి ప్రభుత్వాలు కార్మికుల హక్కులను కాలరాస్తున్నాయి అని,కార్మిక వ్యతిరేకంగా చట్టాలు చేస్తున్నాయి అని,మే డే స్పూర్తితో కార్మికులు అందరూ సంఘటితమై పోరాడాలని,హక్కులు అనేవి ఎవరి దయా దాక్షిణ్యాలు మీద కాదు పోరాడి తీసుకోవాలని, మీ పోరాటాలకు జనసేన పార్టీ మద్దతు ఎప్పుడు ఉంటుంది అని తెలియజేసారు. ఈ సందర్భంగా మునిసిపల్ కార్మికులను సన్మానించి వారికి స్వీట్లు పంచిపెట్టి కార్మికుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేసారు.ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు ఈర్ల చిరంజీవి, నక్క సాయి, కంట మునేంద్ర పాల్గొన్నారు.
No comments:
Post a Comment