ప్రపంచ కార్మిక దినోత్సవం లో : అంజూరు శ్రీనివాసులు
స్వర్ణముఖి న్యూస్, శ్రీకాళహస్తి
ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా 136 వ మే డే ఉత్స వాలు శ్రీకాళహస్తి ఆర్టీసీ డిపో నందు ఘనంగా జరిగాయి డిపో నాయకులు రోశయ్య ఉదయ్ సునీల్ ముఖ్య అతిదిగా జోనల్ నాయకులు NVS. బాబు వారి అధ్యక్షతన విశిష్ట అతిథులుగా ఎంప్లాయిస్ యూనియన్ గౌరవాధ్యక్షులు మరియు శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ధర్మకర్తల పాలకమండలి అధ్యక్షులు అంజూరు శ్రీనివాసులు గారు మరియు Al TUC నాయకులు శ్రీ . జనమాల గురవయ్యగారు హాజరై ... పోరాటల ద్వారా నే కార్మికులు వాళ్ళ హక్కులు కాపాడుకొని ఐకమత్యంతో ముందుకు సాగి ఈ ప్రపంచం అభివృద్ది కావాలంటే కార్మికుల చేసే సహాయం పట్టుదల మరచి పోలేని పారిశ్రామికంగా అభివృద్ది చెందితే యువతకు బ్రతుకు దెరువు కనిపించి నిరు ద్యోగ సమస్య ఉత్పన్నం కాదని హితవు పలికారు. అలాగే వర్క్ షాప్ లో పనిచేస్తున్న కార్మికులకు ఆటోమేటిక్ ఎలక్ట్రికల్ కూల్ వాటర్ ఫిల్టర్ ను అంజూరు శ్రీనివాసులు గారు బహూకరించారు.
తదనంతరం ఎంప్లాయిస్ యూనియన్ గౌరవ అధ్యక్షులు శ్రీ అంజూరు శ్రీనివాసులు గారు భారీ కేకును ఏర్పాటుచేసి కార్మికుల అందరిచేతా కట్ చేయించి వారందరికీ కార్మికుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రకాష్ వెంకటాద్రి సత్య మరియు 100 మంది ఉద్యోగ కార్మికుల తో పాటు అసలు కుమార్ స్వామి, హరినాథ్ నాయుడు, నరసింహ, బాల గౌడ్, కళ్యాణ్ ప్రసాద్ తేజ తదితర నాయకులు పాల్గొన్నారు
No comments:
Post a Comment