మే డే స్ఫూర్తితో ముందుకు సాగుదాం
-ఐ ఎఫ్ టి యు రాష్ట్ర కమిటీ సభ్యురాలు జి.భారతి పిలుపు
స్వర్ణముఖి న్యూస్, శ్రీకాళహస్తి
దేశంలోని కార్మిక వర్గం మే డే స్ఫూర్తి తో ముందుకు సాగాల్సిన అవసరం నేడు ఎంతైనా ఉందని ఐ ఎఫ్ టి యు రాష్ట్ర కమిటీ సభ్యురాలు జి.భారతి పిలుపునిచ్చారు. ఆదివారం మే డే ను పురస్కరించుకుని శ్రీకాళహస్తిలోని ఐ సి డి ఎస్ ప్రాజెక్టు వద్ద, రైల్వే స్టేషన్ ఆటో స్టాండ్, ప్రభుత్వ ఆసుపత్రి, ఐఎఫ్టియు కార్యాలయం వద్ద అలాగే తొట్టంబేడు ఐ సి డి ఎస్ ప్రాజెక్టు వద్ద జెండాలను ఎగురవేసి గౌరవ వందనం చేశారు. ఈ సందర్భంగా మే డే వర్ధిల్లాలి... ప్రపంచ కార్మికులారా ఏకం కండి అంటూ నినాదాలు చేశారు. అనంతరం జి.భారతి మాట్లాడుతూ దేశంలో కులమతాలకు అతీతంగా కార్మికవర్గం ఒక్కటే దేశ అభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తోందని వివరించారు. నేటి పాలకులు పెట్టుబడిదారులకు, పారిశ్రామికవేత్తలకు అనుకూలంగా కార్మికులకు వ్యతిరేకంగా చట్టాలను చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశ సంపద కొందరి చేతుల్లోకి వెళ్లేలా పాలకులు అనుసరిస్తున్న విధానాలు దేశంలో పేదరికం సృష్టిస్తున్నాయని చెప్పారు. పాలకుల ఏకపక్ష, నియంతృత్వ, ఒంటెత్తు పోకడలను కార్మికులు మేడే స్ఫూర్తితో ఎదుర్కోవాలని ఆమె పిలుపునిచ్చారు. పోరాటాల ద్వారా హక్కులను సాధించుకోవచ్చని లేకుంటే జీవితకాలం బానిసలుగా బతకాల్సి వస్తోందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు గంగయ్య, ఏపీ ప్రగతిశీల అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర సహాయ కార్యదర్శి శోభ, జిల్లా నాయకురాలు స్వర్ణ, పార్వతి, దిల్షాద్, జహీర, భారతి, సురేఖ, జయంతి, దివ్య, విజయ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment