శ్రీకాళహస్తి కో-ఆపరేటివ్ మిల్క్ సొసైటీ నూతన కార్యవర్గం నేడు ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి గారిని పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కలిసి ధన్యవాదాలు తెలిపారు.
స్వర్ణముఖి న్యూస్, శ్రీకాళహస్తి
ఏప్రిల్ 30వ తేదీ జరిగిన నామినేషన్లలో మొత్తం 18 మంది నామినేషన్లు దాఖలు చేయగా తొమ్మిది మంది ఉపసంహరించుకున్నారు.కావున వైఎస్ఆర్ సీపీ మద్దతుదారులైన 9 మంది ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఈరోజు 9 మంది డైరెక్టర్లలో ఒకరైన చెర్లోపల్లి గ్రామానికి చెందిన మునగాల మధుసూదన్ రావు (వెలమ సామాజికవర్గం)ను చైర్మన్ గా ఎన్నుకున్నారు.
పాల సొసైటీ డైరెక్టర్గా ఎన్నికైన వారు A.హరినాథ్ రెడ్డి (రెడ్డి,అక్కుర్తి),R.రమణి(వన్నెరెడ్డి, తొండమనాడు),దామోదర్ రెడ్డి (వన్నెరెడ్డి,సుబ్బానాయుడు కండ్రిగ),రాంచంద్రారెడ్డి (రెడ్డి, ఉరందురు),K. రామ్మూర్తి(SC, కొనతనేరి),P. రామయ్య (యాదవ, పెద్ద కన్నలి),N.మంగమ్మ (వన్నెరెడ్డి,కల్లిపూడి) మరియు B. వెంకటరెడ్డి (రెడ్డి,చల్లపాలెం).
No comments:
Post a Comment