శ్రీ కృష్ణా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో భగవద్గీతలు పంపిణీ
స్వర్ణముఖి న్యూస్, శ్రీకాళహస్తి
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణం లోని శ్రీకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అక్షయ తృతీయ సందర్భంగా భగవద్గీత చదవాలన్న కోరిక ఉన్నవారికి ఉచితంగా అందించారు. శ్రీకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు మల్లెంబాకం మునికృష్ణారెడ్డి ఆధ్వర్యంలో పంపిణీ కార్యక్రమం జరిగినది. ఈ కార్యక్రమంనకు ముఖ్య అతిథిగా శ్రీకాళహస్తి దేవస్థాన ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ అంజూరు శ్రీనివాసులు, బోర్డు మెంబర్ పంతులు సున్నపు లక్ష్మీపతి రెడ్డి.. మొదలైన వారు పాల్గొన్నారు . అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది.
చైర్మన్ అంజూరు శ్రీనివాసులు మాట్లాడుతూ.... హిందూ ధర్మంలో భగవద్గీత అనేది ముఖ్యమైనది.
ఈ గ్రంథమునందు అన్ని వర్ణములకు చెందిన మానవులందరికి మోక్షసిద్ధికి అవుసరమగు మార్గములు చూపించియున్నాడు.
కర్మయోగము, భక్తి యోగము, ధ్యాన యోగము, సాంఖ్యయోగము అనగా జ్ఞానయోగము అను వివిధ యోగములు అనగా మోక్షమును కలిగించు మార్గములు పరస్పర విరోధము లేకుండ చూపెట్టబడినవి.
అయితే గ్రంథం మొత్తములోను ధర్మాచరణము కంటే జ్ఞానసంపాదనమే శ్రేయో దాయకమని చెప్పుచూ నిష్కామ కర్మయోగము ద్వారా మానవ సహజమైన కర్మను వివరించారు ఈ కార్యక్రమంలో హరే రామ హరే కృష్ణ సభ్యులు తులసి నారాయణ దాస్ పుణ్యక్షేత్ర దామాదాసు ఎం వి జి దాస్ బలిజ సంఘం అధ్యక్షులు కృష్ణమూర్తి లక్ష్మయ్య బత్తినయ్య రమణ అన్న నందకుమార్ తదితర కృష్ణ భక్తులు పాల్గొన్నారు
No comments:
Post a Comment