విశ్వబ్రాహ్మణ పోతులూరి వీర బ్రహ్మం గారి దేవాలయం, కళ్యాణ మండపం నిర్మాణ పనులను పరిశీలించిన చైర్మన్ : అంజూరు శ్రీనివాసులు
స్వర్ణముఖి న్యూస్, శ్రీకాళహస్తి
శ్రీకాళహస్తి పట్టణంలో వెలసివున్న విశ్వబ్రాహ్మణ శ్రీ పోతులూరి వీరబ్రహ్మంగారి దేవాలయము ముందు ఎన్నో సంవత్సరాలుగా కళ్యాణ మండపం యొక్క పనులు ఆగిపోయి అభివృద్ధికి నోచుకోలేదు. గత నెల నూతనంగా చైర్మన్ బాధ్యతలు చేపట్టిన శ్రీ అంజూరు శ్రీనివాసులు గారిని విశ్వ బ్రాహ్మణ సంఘం వారు సన్మానించడం జరిగినది. ఆ తరుణంలో కళ్యాణమండపం పరిశీలించిన చైర్మన్ కడప వాసి, మిత్రులు సన్నిహితులు అయినటువంటి శ్రీ స్వామి సుబ్రహ్మణ్యం గారిని కళ్యాణ మండపం పనులను పూర్తి చేయాలని కోరారు. చైర్మన్ కోరిన వెంటనే వారు తప్పకుండా త్వరలోనే పూర్తి చేస్తానని తెలియజేశారు. ఈ సందర్భంగా ఈ దినం పోతులూరి వీర బ్రహ్మం గారి దేవాలయం ముందు ఉన్న కళ్యాణమండపం పనులను స్వామి సుబ్రహ్మణ్యం గారు తో కలిసి చైర్మన్ గారు పరిశీలించారు. చైర్మన్ శ్రీ అంజూరు శ్రీనివాసులు మాట్లాడుతూ పనులు చాలా వేగవంతంగా పూర్తయ్యాయని మరికొద్ది రోజుల్లోనే ప్రారంభం కానున్నదని, అడిగిన వెంటనే కళ్యాణ మండపం నిర్మాణం పనులు త్వరిత గతిన పూర్తి చేసిన స్వామి సుబ్రహ్మణ్యం గారికి వారి కుటుంబ సభ్యులకు మరియు విశ్వబ్రాహ్మణ సంఘం వారికి శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని తెలియజేశారు. పై కార్యక్రమంలో సంఘం సభ్యులు సురేష్ ప్లాజా చంద్ర, బాల ఆచారి మరియు హరినాథ్ నాయుడు, పసల కుమార్ స్వామి, నరసింహ, బాలా గౌడ్, ధన, కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు
No comments:
Post a Comment