గోశాల గోసంరక్షణకై లక్ష విరాళం...కృతజ్ఞతలు తెలియజేసిన ఛైర్మన్ శ్రీనివాసులు
స్వర్ణముఖి న్యూస్, శ్రీకాళహస్తి
శ్రీకాళహస్తీశ్వరస్వామి వారి దేవస్థానం చైర్మన్ శ్రీ అంజూరు శ్రీనివాసులు గారికి దేవస్థానం అనుబంధమైన గోశాలలోని గోసంరక్షణకై రూ. 1,00,151/-లు విరాళం అందజేసిన విజయవాడకు చెందిన భక్తుడు శ్రీ వెంకట సుబ్బారావు గారు మరియు వారి కుటుంబ సభ్యులు. శ్రీకాళహస్తీశ్వర దేవాలయం లోని దక్షిణామూర్తి స్వామి వారి వద్ద చైర్మన్ గారికి వారు ఈ విరాళాన్ని అందజేసి వారి యొక్క భక్తి భావాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారి ఎసి మల్లికార్జున్ గారు పాల్గొన్నారు తదనంతరం వారికి ట్రస్ట్ బోర్డు ఛైర్మన్ గారు ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేసి స్వామి అమ్మవార్ల తీర్థ ప్రసాదాలు అందజేసి కృతజ్ఞతలు తెలియజేశారు.
No comments:
Post a Comment