పన్నులను సకాలములో చెల్లించి పురపాలక సంఘ అభివృద్దికి తోడ్పడండి
స్వర్ణముఖి న్యూస్, శ్రీకాళహస్తి :
ఇందుమూలముగా యావన్మంది శ్రీకాళహస్తి పట్టణ పుర ప్రజలకు తెలియజేయడము ఏమనగా, 2021-22 ఆర్ధిక సంవత్సరమునకు గాను చెల్లించవలసిన ఇంటి పన్నులు, ఖాళీ జాగా పన్నులు మరియు కొళాయి పన్నులు తేది: 31-03-2022 లోగా చెల్లించవలసినదిగా పురపాలక సంఘ కమిషనరు బి. బాలాజీ నాయక్ ఓ ప్రకటనలో తెలియజేశారు. అలాగే కొళాయి పన్నులు అధికముగా ఉన్న పన్ను బకాయిదారుల ఇళ్ళకు మంచినీటి కొళాయి కనెక్షన్ ను తొలగించడము జరుగుతుందన్నారు. ఈ మేరకు 22 సచివాలయముల నందలి పన్నులు చెల్లించుటకు 22 కౌంటర్ ను ఏర్పాటు చేయడము జరిగినదని, ప్రజలు తమ వార్డు సమీపములోని సచివాలయము నందలి పన్నులు చెల్లించగలరని తెలియజేశారు. శ్రీకాళహస్తి పురపాలక సంఘ కార్యాలయము నందలి పన్నులు చెల్లించుటకు ప్రత్యేకముగా కౌంటర్ ఏర్పాటు చేయడము జరిగిందని తేది: 31-03-2022 ఉదయము 09.00గంటల నుండి రాత్రి 08.00 గంటల వరకు యధావిధిగా పని చేయునని తెలియజేశారు. అధిక మొత్తములో బకాయిలు వున్న పన్ను యజమానదారులను కమిషనరు బి.బాలాజీ నాయక్ గారు స్వయముగా ఇళ్ళకు వెళ్లి కలిసి పన్ను చెల్లింపు వలన కలిగే ఉపయోగములను తెలియజేసి వారిని చైతన్యపరిచి పన్ను చెల్లింపునకు చర్యలు తీసుకోవడము జరిగినది. ప్రతి ఒక్కరూ చైతన్యవంతులై పన్నులను సకాలములో చెల్లించి పురపాలక సంఘ అభివృద్దికి తోడ్పడవలసినదిగా తెలియజేయడమైనది. సదరు కార్యక్రమము నందలి రెవెన్యూ అధికారి పి.యం.వి. నారాయణ రెడ్డి, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు రవికాంత్, బి. బాల చంద్రయ్య, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment