బి.సి సంఘాల ఆధ్వర్యంలో బి.పి మండల్ గారి జయంతి - స్వర్ణముఖి న్యూస్

 స్వర్ణముఖి న్యూస్

NEWS

Breaking

Home Top Ad

Post Top Ad

Thursday, August 25, 2022

బి.సి సంఘాల ఆధ్వర్యంలో బి.పి మండల్ గారి జయంతి

 బి.సి సంఘాల ఆధ్వర్యంలో బి.పి మండల్ గారి జయంతి 


స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :


 ఏ.పి.బి.సి చైతన్య సమితి మరియు జాతీయ బి.సి. సంక్షేమ సంఘం సంయుక్తంగా బి.పి మండల్ గారి జయంతిని శ్రీకాళహస్తి పట్టణంలో ని యన్.జి.ఓ భవన్ నందు ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ఏ.పి.బి.సి చైతన్య సమితి రాష్ట్ర అధికార ప్రతినిధి కైలసాని సాయికుమార్ మాట్లాడుతూ బి.సి రిజర్వేషన్ పితామహుడు బి.పి మండల్ గారు అని 1979 - 1980 లో బి.సి మండల్ చైర్మన్ గా ఆయన 40 సిఫార్సు లను ప్రభుత్వం కు అందచేస్తే దానిలో 1సిఫార్సు ను మాత్రమే అదికూడా 1990లో అమలు చేయడం జరిగిందని. అదే ఈ రోజు బి.సి 27% రిజర్వేషన్ అని. కుల జనగణన జరిగితే బి.సి లకు న్యాయం జరుగుతుందని. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు కుల జనగణన కు అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం కు తెలియజేసిన దానిపై కేంద్ర ప్రభుత్వం ఆలోచించకపోవటం విచారకరం అని తెలిపారు.

జాతీయ బి.సి సంక్షేమ సంఘం తిరుపతి జిల్లా అధికార ప్రతినిధి పురుషోత్తం గౌడ్ గారు మాట్లాడుతూ బి.పి మండల్ గారు జమిందార్ కుటుంబం కు చెందిన విద్యార్థి దశ నుంచి వివక్షకు గురవటం, బి.సి, యస్.సి, యస్.టి, మైనారిటీ లపై జరిగిన దాడులు, అత్యాచారాలకు వ్యతిరేకంగా ఎన్నో పోరాటాలు చేసారని తెలిపారు.

ముఖ్య అతిథిగా హాజరైన తురక అమర్నాథ్ మాట్లాడుతూ బి.సి లు ఎప్పుడైతే రాజకీయంగా, ఆర్థికంగా అభివృద్ధి చెంది చట్ట సభల్లో స్థానం సంపాదిస్తారో అప్పుడే పూలే, అంబేద్కర్, బి.పి మండల్ గార్ల ఆశయాలు సాధించిన వారవుతామని తెలిపారు.

తరువాత శ్రీకాళహస్తి జాతీయ బి.సి సంక్షేమ సంఘం నియోజకవర్గ అధ్యక్షులు గా డి.వి.రమణ, ఏర్పేడు మండల అధ్యక్షులు గా కోటకొండ గోపాల్ రాజు, శ్రీకాళహస్తి మండల అధ్యక్షులు గా కె.ప్రసాద్ యాదవ్, తొట్టంబేడు మండల అధ్యక్షులు గా యస్.తిరుపాలయ్య, శ్రీకాళహస్తి మండల ప్రధాన కార్యదర్శి యస్.పురుషోత్తం లకు నియామక పత్రాలను అమర్నాథ్, పురుషోత్తం గౌడ్, సాయికుమార్ లు అందజేశారు.

పై కార్యక్రమంలో వై.జగన్నాధం (తిరుపతి జిల్లా ప్రధాన కార్యదర్శి), ఎ.చంద్రశేఖర్ (తిరుపతి జిల్లా కార్యదర్శి), కన్నా వెంకటేశ్వర్లు (సీనియర్ బి.సి నాయకులు), మన్నేపల్లి శ్రీనివాసులు (జాతీయ బి.సి సంక్షేమ సంఘం శ్రీకాళహస్తి పట్టణ గౌరవ అధ్యక్షులు), నెమళ్ళూరు సుబ్రమణ్యం (బుజ్జి) బి.సి నాయకులు, జె.దుర్గా ప్రసాద్ (సీనియర్ బి.సి నాయకులు) యస్.జమున (తిరుపతి పట్టణ మహిళా అధ్యక్షురాలు), కటికాల భరణి క్రిష్ణ (ఏ.పి.బి.సి చైతన్య సమితి శ్రీకాళహస్తి పట్టణ కో ఆర్డినేటర్), కోడూరు శివకుమార్ (ఏ.పి.బి.సి చైతన్య సమితి కార్యదర్శి), నెల్లూరు గాంధీ (జాతీయ బిసి సంక్షేమ సంఘం శ్రీకాళహస్తి పట్టణ ఉపాధ్యక్షులు), పుల్లూరు గురుమూర్తి (జాతీయ బిసి సంక్షేమ సంఘం శ్రీకాళహస్తి పట్టణ ఉపాధ్యక్షులు), ఎ.కిషోర్ (సూళ్లూరుపేట నియోజకవర్గం అధ్యక్షులు), నీలం వెంకటేశ్వర్లు (పెళ్ళకూరు మండలం కార్యదర్శి), శ్రీకాళహస్తి నియోజకవర్గ బి.సి నాయకులు మారాబత్తిన మల్లికార్జున్, కొరుటూరు గురవయ్య ఆచారి మరియు బి.సి సభ్యులు పాల్గొన్నారు.


No comments:

Post a Comment

Blog Archive

Post Bottom Ad