రాజీమార్గమే రాజ మార్గం అని పిలుపునిచ్చిన శ్రీకాళహస్తి సీనియర్ సివిల్ జడ్జి వై శ్రీనివాసరావు - స్వర్ణముఖి న్యూస్

 స్వర్ణముఖి న్యూస్

NEWS

Breaking

Home Top Ad

Post Top Ad

Sunday, August 14, 2022

రాజీమార్గమే రాజ మార్గం అని పిలుపునిచ్చిన శ్రీకాళహస్తి సీనియర్ సివిల్ జడ్జి వై శ్రీనివాసరావు

 రాజీమార్గమే రాజ మార్గం అని పిలుపునిచ్చిన శ్రీకాళహస్తి సీనియర్ సివిల్ జడ్జి వై శ్రీనివాసరావు




 స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :


సుప్రీంకోర్టు, హైకోర్టు మరియు చిత్తూరు జిల్లా ప్రధాన న్యాయ మూర్తి  ఆదేశాల మేరకు  ఈ రోజు జరుగు జాతీయ లోక్ అదాలత్ ని విజయవంతం చేయాలని కోరిన శ్రీకాళహస్తి సీనియర్ సివిల్  న్యాయమూర్తి వై శ్రీనివాసరావు మరియు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి రాఘవేంద్ర, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి నరేంద్ర రెడ్డి


చిత్తూర్ జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని కోర్ట్ ఆవరణలో జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం జరిగినది.ఈ కార్యక్రమంలో న్యాయవాదులు,  శ్రీకాళహస్తి కోర్ట్ పరిధిలో ఉన్న అన్ని శాఖల అధికారులు, అన్ని శాఖల బ్యాంకు అధికారులు, బిఎస్ఎన్ఎల్ సిబ్బంది, పారా లీగల్ వాలంటరీలు, కోర్ట్ సిబంది పాల్గొన్నారు.


మొదట కోర్టు ఆవరణలో మెడికల్ క్యాంప్ జరిగింది.


సీనియర్ సివిల్ జడ్జి మాట్లాడుతూ.... జాతీయ లోక్ అదాలత్ ద్వారా అధిక సంఖ్యలో కేసులు పరిష్కరించుకోవడానికి సహకరిస్తూ లోక్ అదాలత్ విజయవంతానికి కృషి చేయాలని, "రాజీమార్గమే రాజ మార్గంగా" ఎన్నుకొని ఎక్కువ కేసులని పరిష్కరించనికి దోహద పడాలని కోరారు. 

రాజమార్గంలో  కక్షిదారులతో  ప్రత్యక్ష పద్దతిలో కేసుల పరిష్కర పద్ధతే బాగుంటుందని వ్యక్తం చేశారు. ఈ లోక్ అదాలత్ కి కోర్టులో దీర్ఘకాలంగా పెండింగులో ఉన్న కేసుల్లో కక్షిదారులను ఒప్పించి అధిక సంఖ్యలో వాటిని రాజమార్గంలో పరిష్కరించడానికి సమిష్టి కృషి అవసరమని  తెలిపారు.

No comments:

Post a Comment

Blog Archive

Post Bottom Ad