బాధితులకు ఓదార్పు :అంజూరు శ్రీనివాసులు
శ్రీకాళహస్తి టూరిస్ట్ బస్టాండ్ ఆవరణంలో బస్సు బ్రేక్ ఫెయిల్ కారణంగా చోటు చేసుకున్న ప్రమాదంపై శ్రీకాళహస్తి దేవస్థానం చైర్మన్ అంజూరు శ్రీనివాసులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సమాచారం తెలిసిన వెంటనే శ్రీకాళహస్తి ఏరియా హాస్పిటల్ కి వెళ్లి ప్రమాదంలో గాయపడిన భక్తులు కామరాజ్, మునియప్ప ల కు మెరుగైన వైద్య చికిత్సలు అందించే విధంగా చర్యలు చేపట్టారు. బస్సు ఢీకొని మృతి చెందిన పొన్ను స్వామి కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పారు. పొన్ను స్వామి మృతదేహాన్ని పోస్టుమార్టం నిర్వహించి ధర్మపురికి పంపించే విధంగా స్థానిక వన్ టౌన్ పోలీసులు తో చర్చించి తగు ఆదేశాలు ఇచ్చారు.
దేవస్థానం అంబులెన్స్ పంపే అవకాశం లేకపోవడంతో చైర్మన్ అంజూరు శ్రీనివాసులు చొరవ చూపి సొంత నిధులతో రూ.17,000/- లతో అంబులెన్స్ ఏర్పాటు చేసి మృతదేహం స్వస్థలానికి పంపించే విధంగా ఏర్పాటు చేశారు. బస్సులో వచ్చిన భక్తులందరికీ టూరిజం శివ సదన్ లో బస వసతి ఏర్పాటు చేసి, అన్నప్రసాదాలు అందించే ఏర్పాటు చేశారు.
భక్తులు ఎవరు అధైర్య పడద్దని అందరికీ ధైర్యం చెప్పి స్వస్థలాలకు వెళ్లే విధంగా తగు సహాయ సహకారాలు అందిస్తామని భరోసా ఇచ్చి భక్తుల్లో ధైర్యం నింపారు.
శ్రీకాళహస్తిశ్వరుని దర్శనానికి వచ్చిన భక్తుల బస్సు బ్రేక్ ఫెయిల్ కారణంగా ప్రమాదం చేసుకోవడం విషాదకరమని, మానవతా దృక్పథంతో ఆ కుటుంబాలకు తమ వంతు సహాయ సహకారాలు అందించామని ఆలయ చైర్మన్ అంజూరు శ్రీనివాసులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో బోర్డు సభ్యులు మున్నా రాయల్, జయశ్యామ్ రాయల్, పసల సుమతి, ప్రకాశం పంతులు ప్రత్యేక ఆహ్వానితులు చింతామణి పాండు తదితరులు పాల్గొన్నారు
No comments:
Post a Comment