పోరాట యోధుల ఫలితమే స్వాతంత్రం - ది స్కూల్ - స్వర్ణముఖి న్యూస్

.com/img/a/

NEWS

Home Top Ad

temple%20ad%20%20copy

Post Top Ad

Monday, August 8, 2022

demo-image

పోరాట యోధుల ఫలితమే స్వాతంత్రం - ది స్కూల్

poornam%20copy

 పోరాట యోధుల ఫలితమే స్వాతంత్రం 


 

WhatsApp%20Image%202022-08-08%20at%2011.46.27%20AM

WhatsApp%20Image%202022-08-08%20at%2011.46.26%20AM

స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :


పోరాట యోధుల ఫలితమే స్వాతంత్రం అని ది స్కూల్ హెచ్ ఎం విశాల అన్నారు. సోమవారం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన పిలుపు మేరకు పట్టణంలోని ది స్కూల్ లో విద్యార్థిని విద్యార్థులు భరతమాత, శివాజీ తదితరుల వేషధారణలో త్రివర్ణ పతాకాన్ని చేతపట్టుకుని ర్యాలీ నిర్వహించారు . ఈ సందర్భంగా హెచ్ ఎం మాట్లాడుతూ స్వాతంత్ర పోరాట యోధుల ఫలితమే మనకు నేడు సంపూర్ణ స్వతంత్రం వచ్చిందన్నారు . త్రివర్ణ పతాక రూపకర్త పింగళి వెంకయ్య, (1876 ఆగష్టు 2 - 1963 జూలై 4), స్వాతంత్ర్య సమర యోధుడు, భారతదేశ జాతీయ పతాక రూపకర్త. ఆయన  1916లో "భారత దేశానికి ఒక జాతీయ పతాకం" అనే ఆంగ్ల గ్రంథాన్ని రచించాడు.

1916లో లక్నోలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో వెంకయ్య తయారు చేసిన జాతీయ జెండాను ఎగురవేశారు. 1919లో జలంధర్ వాస్తవ్యులైన లాలా హన్స్ రాజ్ మన జాతీయ పతాకంపై రాట్న చిహ్నముంటే బాగుంటుందని సూచించగా గాంధీజీ దాన్ని అంగీకరించాడు. 1921లో అఖిల భారత కాంగ్రెస్ సమావేశాలు బెజవాడలో జరిగాయి. గాంధీజీ వెంకయ్యను ఆ సమావేశానికి పిలిపించి కాషాయం, ఆకుపచ్చ రంగులు కలిగి, మధ్య రాట్నంగల ఒక జెండాను చిత్రించమని కోరాడు. మహాత్ముడు సూచించిన ప్రకారంగానే, ఒక జెండాను సమకూర్చాడు వెంకయ్య. అనంతరం వచ్చిన ఆలోచనల మేరకు, సత్యం, అహింసలకు ప్రత్యక్ష నిదర్శనమైన తెలుపు రంగు కూడా ఉండాలని గాంధీజీ అభిప్రాయపడగా, వెంకయ్య ఆ జెండాలో అదనంగా తెలుపు రంగును చేర్చి నేటి త్రివర్ణ పతాకాన్ని దేశానికి ప్రసాదించారని పేర్కొన్నారు .  గాంధీజీ ప్రోద్బలంతో త్రివర్ణపతాకం పుట్టింది ఆంధ్రప్రదేశ్ లోనే. కాషాయ రంగు హిందువులకు చిహ్నమని, ఆకుపచ్చ ముస్లింలకని పేర్కొనడంతో, ఇతర మతాలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలనే అభిప్రాయం వెలువడడంతో గాంధీజీ సూచనపై ఆకుపచ్చ, కాషాయ రంగులుతో పాటు తెలుపు కూడా చేర్చి త్రివర్ణ పతాకాన్ని వెంకయ్య రూపొందించాడు. మధ్యనున్న రాట్నం గ్రామ జీవనాన్ని, రైతు కార్మికత్వాన్ని స్ఫురింప చేస్తుందన్నాడు. కార్మిక కర్షకులపై ఆధారపడిన భారతదేశం, సత్యాహింసలను ఆచరించడంతో సుభిక్షంగా ఉంటుందని మన ఆశయం. ఆ ఆశయ చిహ్నమే మన త్రివర్ణ పతాకం. 1947, జూలై 22న భారత రాజ్యాంగ సభలో నెహ్రూ జాతీయ జెండా గురించి ఒక తీర్మానం చేస్తూ, మునుపటి త్రివర్ణ జెండాలోని రాట్నాన్ని తీసేసి, దాని స్థానంలో అశోకుని ధర్మచక్రాన్ని చిహ్నంగా ఇమిడ్చారు. చిహ్నం మార్పు తప్పితే పింగళి వెంకయ్య రూపొందించిన జెండాకు నేటి జెండాకు తేడా ఏమీ లేదు. అశోకుని ధర్మచక్రం మన పూర్వ సంస్కృతికి సంకేతమని వివరించారు . అనంతరం విద్యార్థులు 75 అంకెలో కూర్చుని తమ దేశభక్తిని చాటారు . కార్యక్రమంలో ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు , విద్యార్థులు , తల్లిదండ్రులు పాల్గొన్నారు . 

No comments:

Post a Comment

Blog Archive

Post Bottom Ad

Pages