MGM హాస్పిటల్స్ నందు రక్త దాన శిబిరం విజయవంతం
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
శ్రీకాళహస్తి లోని *MGM గ్రూప్ చైర్మన్ శ్రీ గుడ్లూరు మల్లికార్జున నాయుడు తన 66 వ జన్మదిన వేడుకల్లో భాగంగా MGM హాస్పిటల్స్ ఆవరణలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ రక్త దాన శిబిరం లో దాదాపు 100 మంది దాతలు స్వచ్చందంగా రక్తదానం చేశారు. ఈ రక్తదాన శిబిరం 2005 వ సంవత్సరం నుండి అనగా ఇప్పటికి దాదాపు 18 సంవత్సరములు గా రక్తదాన శిబిరాలు నిర్వహిస్తూ ఎంతోమంది అత్యవసర సమయాల్లో ప్రాణాలు కాపాడే ఈ కార్యక్రమం చేపడుతున్నారు. అలాగే చిలకావారి కండ్రిగ కు చెందిన తిరుపాలయ్య గతంలో రోడ్డు ప్రమాదం లో తన కాలు పోగొట్టుకొని వికలాంగుడిగా బాధపడటాన్ని చూసి చలించిపోయి ఉచితం గా ఆయనకు కృత్రిమ కాలు ను తెప్పించి ఇచ్చి తన మంచి తనాన్ని చాటుకున్నారు. ఈ సేవా కార్యక్రమం లో భాగంగా గా MGM గ్రూప్ డైరెక్టర్ గుడ్లూరు మయూర్ మాట్లాడుతూ మా నాన్న గారు మల్లికార్జున నాయుడు గారి జన్మదినం రోజు న ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని రాబోయే రోజుల్లో ఇలాంటి గొప్ప కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటామని తెలిపారు. గత 18 సంవత్సరములు గా మా మీద అభిమానం తో రక్తదాన శిబిరాల్లో పాల్గొని రక్త దానం చేస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం శ్రీకాళహస్తి ప్రెస్ క్లబ్ కి విరాలన్ని అందించారు.
No comments:
Post a Comment