తల్లిపాల సంస్కృతి ఉన్నతికి అవగాహన మరియు తోడ్పాటు
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు(1-7ఆగస్టు 2022)
ఐసిడిఎస్ ప్రాజెక్ట్ శ్రీకాళహస్తి పరిధిలోని అంగన్వాడీ కార్యకర్తలు అందరికీ ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు పై సి డి పి ఓ బి.శాంతి దుర్గ మహిళాభిరుద్ది మరియు శిశు సంక్షేమ శాఖ మరియు ఆరోగ్య శాఖ సమన్వయంతో అవగాహనా కార్యక్రమాన్ని నిర్వహించారు అంగన్వాడీ కార్యకర్త ద్వారా గ్రామస్థాయిలో ప్రతి గర్భవతికి మరియు బాలింతలకు తల్లిపాల యొక్క ప్రాముఖ్యతను గూర్చి తెలియజేయడానికి వారం రోజుల పాటు అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాలని తెలియజేశారు పిల్లలు వ్యాధినిరోధకశక్తి కలిగి సంపూర్ణ ఆరోగ్యంతో జీవించడానికి తల్లి పాలు ఎంతగానో ఉపయోగపడతాయని బిడ్డ పుట్టిన మొదటి గంటల్లోనే తల్లి పాలు పట్టించాలని ,మొదటి ఆరు నెలల వయస్సు వరకు కేవలం తల్లిపాలు మాత్రమే ఇప్పించాలని, ఆరు నెలల మీదట అనువైన కుటుంబ ఆహారం సాధారణంగా ప్రారంభించాలని తల్లిపాలు రెండు సంవత్సరముల వయస్సు వరకు లేదా ఆపైన వీలైనంత ఎక్కువ కాలం ఇప్పించడం సరైన పోషణ విధానం అని ఈ విధానం వల్ల ఆహార సంబంధిత చక్కెరవ్యాధి, గుండెజబ్బులు, క్యాన్సర్, మొదలైనవి రాకుండా కూడా నివారించవచ్చు అని అన్నారు
స్థానిక కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ ముంతాజ్ మాట్లాడుతూ జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం మనదేశంలో 88.6 శాతం ప్రసవాలు ఆస్పత్రిలో జరుగుతుందని అందులో కేవలం 41.6 శాతం పనులు మాత్రమే మొదటి గంటలోపు తల్లిపాలు ప్రారంభిస్తున్నారని ఇది అంత ఆశాజనకంగా కాదని ఇది కేవలం అవగాహన లోపం వల్ల జరుగుతుందని ఇది ఆ శిశువు ఆరోగ్యం పైన అభివృద్ధి పైన చాలా తీవ్ర ప్రభావం చూపుతుందని అన్నారు
ఎంపిడిఓ నరసింహమూర్తి మాట్లాడుతూ తల్లి పాలు సంపూర్ణ ఆహారం ఆహారం అని ప్రతి తల్లికి తెలియజేయవలసిన అవసరం ,ఉందని దానికి ఈ అవగాహన కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు , ఈ కార్యక్రమానికి మండల ఇంచార్జి నాగర్ రెడ్డి,మరియు సూపర్ వైస్సార్ లు , పాల్గొన్నారు
No comments:
Post a Comment