శ్రీకాళహస్తి జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల నందు ఆజాదీక అమృత మహోత్సవ వేడుకలు..!
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శ్రీకాళహస్తి పట్టణంలోని ఆర్ పి బి ఎస్ జడ్పీ బాయ్స్ హై స్కూల్ నందు విద్యార్థులచే 75వ నమూనాను ప్రదర్శించడం జరిగింది.
ఈ సందర్భంగా ఇంచార్జ్ శివ కుమార్ మాట్లాడుతూ
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపుమేరకు జిల్లా విద్యాశాఖ అధికారుల ఆదేశాల మేరకు ఆజాదీక అమృత మహోత్సవ వేడుకలలో భాగంగా నేడు మా పాఠశాల నందు విద్యార్థులకు స్వతంత్ర పోరాట సమరయోధులు గురించి తెలియజేసి వారి స్ఫూర్తితో విద్యార్థులు ముందుకు వెళ్లాలని తెలియజేయడం జరిగింది అని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యయేతర సిబ్బంది మధు బాబు, మహేష్ పి డి ఉపాధ్యాయురాలు ఇందిరా ఉపాధ్యాయురాలు సరోజా, లత, తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment