ప్రభుత్వ సూచనలకు అనుగుణంగా ప్రతి ఒక్క మెడికల్ షాప్ ఉండాలని కోరిన జిల్లా అసిస్టెంట్ డ్రగ్ కంట్రోలర్ కళ్యాణ చక్రవర్తి
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్నంలో ఔషధ తనిఖీ అధికార కార్యాలయంను జిల్లా అసిస్టెంట్ డ్రగ్ కంట్రోలర్ కళ్యాణ చక్రవర్తి చేతులు మీదుగా ప్రారంభించారు.
ఈ కార్యక్రమమునకు ముఖ్యఅతిథిగా డ్రగ్ ఇన్స్పెక్టర్ రూతు, జిల్లా కెమిస్ట్ అండ్ డ్రగ్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పివి రత్నం, , సెక్రెటరీ నరేష్ బాబు, ట్రెజరర్ టి నరసింహులు , శ్రీకాళహస్తి కెమిస్ట్ అండ్ డ్రగ్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నంద నరసింహులు, సెక్రటరీ మునిరెడ్డి, ట్రెజరర్ చిన్నారావు మరియు కమిటీ పెద్దలు, సభ్యులు, శ్రీకాళహస్తి లోని మెడికల్ షాప్ యజమానులు పాల్గొన్నారు
అధికారులు మాట్లాడుతూ...
శ్రీకాళహస్తిలో డ్రగ్ లైసెన్స్ కార్యాలయం రావడం చాలా సంతోషంగా ఉంది అని అన్నారు. అలాగే జిల్లా విభజన తర్వాత గూడూరులో ఉన్న డ్రగ్ లైసెన్స్ కార్యాలయము శ్రీకాళహస్తిలోకి రావడం జరిగింది.ఇంకా మన జిల్లాకు సంబంధించిన మన జోనల్ లో ఉన్న మండలంలో జరుగు పనులన్నీ శ్రీకాళహస్తి డ్రగ్ లైసెన్స్ కార్యక్రమం నుంచి జరుగుతుంది అని అన్నారు . అలాగే అన్ని మెడికల్ షాప్ వాళ్ళు ప్రభుత్వం సూచించిన సూచనలను పాటిస్తూ తగు జాగ్రత్తగా సేవా దృక్పథంతో పనిచేయాలని అన్నారు.
No comments:
Post a Comment