మొహరం ముగింపు కార్యక్రమము శాస్త్రోస్తముగా జరిగినది
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని హజ్రత్ జూమ్లే షాపీర్ దర్గా ఆవరణంలో దర్గా నిర్వాహకులు సయ్యద్ బాబా ఫరీద్ ఆధ్వర్యంలో హజరత్ ఇమామే హుస్సేన్ రజి అల్లాహ్ తల అన్హు యొక్క జియారత్ కె ఫాతిహా ముగింపు కార్యక్రమము శాస్త్రోస్తముగా జరిగినది. ఈ సంవత్సరము భక్తులు ఎక్కువమంది పాల్గొని వారి కోరికలు మనసులో సంకల్పం చేసుకునారు. అనంతరం దర్గాలో సిజర ఫాతిహా జరిగినాయి
ఈ కార్యక్రమంలో దర్గా నిర్వాహకులు సయ్యద్ బాబా ఫరీద్, డి ఎస్ కాలేషా మొహమ్మద్, దర్గా కమిటీ సభ్యులు గుమ్మల్ల రాజేశ్వరరావు, గరికపాటి రమేష్ బాబు, ఎంఎస్ జమురుద్ బాదుషా, పి యాసీన్, నవీన్ కుమార్, బాలాజీ, పి బావ జాన్, రహీమ్ ఖాన్, అబ్దుల్లా తదితరులు పాల్గొన్నారు
దర్గా నిర్వాహకులు సయ్యద్ బాబా ఫరీద్ మాట్లాడుతూ.... దర్గా ఆవరణంలో కులమతాలకతీతంగా రొట్టెల పండుగ ఘనంగా జరిగింది అన్నారు. అలాగే దర్గా పీఠాధిపతి సయ్యద్ అహ్మద్ గారు అనారోగ్యం కారణంగా పై కార్యక్రమాలు పాల్గొనలేక పోయారు ఆయన కోసము దర్గాలో ప్రత్యేక పూజలు జరిపించి ఆరోగ్యం తొందరగా నయం అవ్వాలని అల్లాహ్ తో ప్రార్థించినాము అన్నారు. అలాగే అందరూ ఆరోగ్యంతో సుఖసంతోషాలతో ఉండాలని స్వామి వారికీ ప్రతేక ప్రార్ధనలు చేసారు.
No comments:
Post a Comment