ప్రయాణికుల సమస్యలపై అర్జీ ఇచ్చిన పారా లీగల్ వాలంటరీ
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ డిపో అధికారుల కు ప్రయాణికులు ఎదుర్కొన్న సమస్యలపై అర్జీ ఇచ్చిన పార లీగల్ వాలంటరీలు.
పార లీగల్ వాలంటరీలు మాట్లాడుతూ.... తిరుపతి బస్టాండ్ నందు మన ఆర్టీసీ డిపో బస్సుల కండక్టర్లు ప్రయాణికులపై దురుసుగా ప్రవర్తిస్తున్నారు. ముఖ్యంగా చిల్లర సమస్యల పై ప్రయాణికులతో ఎక్కువ దురుసుగా ప్రవర్తిస్తున్నారు. దీనివల్ల ఆర్టీసీకి గండి పడే ప్రమాదం ఉంది. మరియు ఆర్టీసీ బస్ స్టాప్ వద్ద ప్రయాణికులకు టికెట్ తీసుకోంటున్నారు. అనంతరం బస్సు బయలుదేరి బయట, తిరుమల బస్టాండ్ ఆఖరి వరకు ఇంతకుముందు కండక్టర్ టికెట్ లు తీసుకొని అక్కడ క్లోజ్ చేసి దిగేవాళ్లు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అలా చేయటం లేదు అని గమనించగలరు. దీనివల్ల ప్రభుత్వ ఉద్యోగాలు మరియు అత్యవసర సమయంలో ఎక్కే ప్రయాణికులకు, వికలాంగులు, వృద్ధులు చాలా ఇబ్బందికరంగా ఉంది. బస్ స్టాప్ వద్ద కండక్టర్ దిగడం వల్ల కొంతమంది అత్యవసర సమయంలో బస్టాండ్ ఆఖరి ఎక్కే వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాగే ఆఖరి సమయంలో ప్రభుత్వ ఉద్యోగులు బస్సు ఎక్కి టికెట్ అడిగినచో బస్సు ఖాళీగా ఉన్నా కూడా టికెట్ లేదు, వేరే బస్సు ఎక్కండి అని దురుసుగా సమాధానం చెబుతున్నారు. తర్వాత 15 నిమిషాలు బస్సు కోసం వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇలాంటి సమస్యలపై శ్రీకాళహస్తి మరియు తిరుపతి ఆర్టీసీ డిపో మేనేజర్లు స్పందించి ప్రయాణికులకు తగు సౌకర్య కరంగా ఉండాలని కోరడమైనది
No comments:
Post a Comment