శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం చైర్మన్ గా కొట్టె సాయి ప్రసాద్
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం చైర్మన్ గా తనను నియమించడంపై జనసేన నేత కొట్టె సాయి ప్రసాద్ ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక సామాన్య కార్యకర్తను సీఐ కొట్టడం అతనికి అండగా పవన్ కళ్యాణ్ రావడం లోనే ఆయన చిత్తశుద్ధి కనిపిస్తుందన్నారు. ఆజన్మాంతం పవన్ కళ్యాణ్ కి రుణపడి ఉంటానని తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడుకు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి, మంత్రినాదెండ్ల మనోహర్ కు ,హరి ప్రసాద్ కు ధన్యవాదాలు తెలిపారు. శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం అభివృద్ధికి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి సూచనలతో తనవంతు కృషి చేస్తానని, సామాన్య ప్రజలకు పెద్దపీట వేస్తానని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు కుమార్, గరికపాటి చంద్ర శేఖర్, మహేష్, చిరంజీవి కార్యకర్తలు పాల్గొన్నారు







No comments:
Post a Comment