తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో వైకాపా నాయకుల దిష్టిబొమ్మ దగ్ధం ప్రయత్నం,అడ్డుకున్న పోలీసులు
తెలుగుమహిళ, తెలుగు యువత, TNSF ఆధ్వర్యంలో జగన్, విజయసాయి రెడ్డి, అవంతి శ్రీనివాస్, అంబటి రాంబాబు, గోరంట్ల మాధవ్ దిష్టిబొమ్మలు దగ్నం
మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నటువంటి ప్రజాప్రతినిధుల పైన చర్యలు తీసుకోవాలి...
శ్రీకాళహస్తి నియోజకవర్గం లో ఎన్టీఆర్ విగ్రహం ముందు నిరసన
తిరుపతి పార్లమెంట్ తెలుగుమహిళా అధ్యక్షురాలు చక్రాల ఉష మాట్లాడుతూ ... మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నటువంటి ప్రజాప్రతినిధుల పైన వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు సిగ్గులేకుండా ఒకడు అరగంట అంటే మరొకడు గంట అని పిలిచే వెదవలకు ప్రమోషన్లు ఇస్తూ, మరొకడు పుట్టుకల గురించి మహిళలను అసభ్యంగా మాట్లాడే వెదవలకు విచ్చలవిడిగా వదిలేసినా జగన్ లాంటి సియం ఉండడం మన దౌర్భాగ్యం అంటూ మండిపడ్డారు
ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధులు ప్రజలకు ,సమాజానికీ జవాబు దారితనంగా, మరియు ఆదర్శంగా ఉండవలసినటువంటి ప్రజా ప్రతినిధులు మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న తీరు చూస్తా ఉంటే ,సభ్య సమాజం సిగ్గుతో తలవంచుకునేలా ఉందని, రెండు రోజుల క్రితం హిందూపురం పార్లమెంట్ సభ్యులు గోరంట్ల మాధవ్ మహిళతో న్యూడ్ వీడియో కాల్ మాట్లాడుతూ ఉన్న వీడియో అన్ని ప్రసారమాధ్యమాల్లో రావడం చూస్తుంటే, భారతదేశానికి చట్టాలు చేసేటువంటి పార్లమెంటు వ్యవస్థను కూడా అప్రతిష్ట పాలు చేసినట్టుగాను, అంతేకాకుండా గతంలోనూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలతో అసభ్యకరంగా మాట్లాడుతున్నటువంటి ఆడియో, వీడియో కాల్స్ బహిర్గతమైనప్పటికీ ఏ మాత్రం కూడా స్పందించకపోవడమే ఇటువంటి ఘటనలు పునరావృతం అవ్వడానికి కూడా ఒక ఉదాహరణ అని, ఇప్పటికైనా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వీటన్నిటి పైన నిజ నిజాలు తేల్చి ,ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వం పైన ఉన్నదని, ఇటువంటి ఘటనలు జరుగుతున్నా కూడా రాష్ట్ర మహిళా కమిషన్ ఎందుకు స్పందించడం లేదో అర్థం కాని పరిస్థితి అని, మహిళా సాధికారిత తమ ప్రభుత్వం మొదటి ధ్యేయమని గొప్పలు చెప్పుకుంటూ ఉన్న ప్రభుత్వం, మహిళల పట్ల ప్రజా ప్రతినిధులు ప్రవర్తిస్తున్న తీరును ఎందుకు ఎండగట్టలేకపోతుందో అర్థం కావడం లేదు అని, ప్రజా ప్రతినిధులు వ్యవహరిస్తే ఒక రకమైనటువంటి న్యాయం, సామాన్య ప్రజలు చేస్తే మరొక విధమైనటువంటి న్యాయం జరుగుతున్నదని ప్రజలు వాపోతున్నారని, ఇటువంటి ప్రశ్నలకు ప్రభుత్వమే జవాబు చెప్పాలని, ఇప్పటికైనా కూడా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి నిజ నిజాలు తేల్చి, మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించినటువంటి ప్రజా ప్రతినిధులు ఎంతటి వారినైనా సరే వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, మరియు వారిని ఆ పార్టీ నుండి సస్పెండ్ చేయాలని మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు
అనంతరం నాయకుల మధ్య పోలీసులు మధ్య వాగ్వాదంమయ్యి పోలీసులు చక్రాల ఉషా ని కొబాకు లక్ష్మణ్ ని, పెసర రామకృష్ణ ని అరెస్టు చేసి తీసుకువెళ్లారు రెండు గంటల అనంతరం విడుదల చేశారు ,
No comments:
Post a Comment