అడిషనల్ జిల్లా మరియు సెషన్ కోర్ట్ పనులను ప్రారంభించిన న్యాయమూర్తులు మరియు బార్ అసోసియేషన్
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని కోర్ట్ ఆవరణలో
మరి కొద్ది రోజుల్లో ప్రారంభమైఏ
అడిషనల్ జిల్లా మరియు సెషన్ కోర్ట్ కొరకు పనులు ప్రారంభించిన శ్రీకాళహస్తి ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ రాఘవేంద్ర, అడిషనల్ జూనియర్ సివిల్ నరేందర్ రెడ్డి మరియు
బార్ అసోసియేషన్ అధ్యక్షులు మాడుపురు ప్రసాద్, సీనియర్ న్యాయవాదులు ఉదయ్ నాథ్, ప్రభాకర్ రెడ్డి , వీర రాఘవ రెడ్డి, ముని ప్రసాదు, దశరథరామ్ రెడ్డి, ముని శంకర్ రెడ్డి, కుమారు మరియు బార్ అసోసియేషన్ సభ్యులు, న్యాయవాదులు పాల్గొన్నారు.
ముందుగా టెంకాయ కొట్టి, పూజ చేసి పనులను న్యాయమూర్తుల చేతులమీదుగా ప్రారంభించారు.
న్యాయమూర్తులు మాట్లాడుతూ... రాబోయే రోజులో శ్రీకాళహస్తి డివిజన్ ప్రజలకు చాల ఉపయోగకరమైన, మహత్కర కార్యక్రమము అడిషనల్ జిల్లా మరియు సెషన్ కోర్ట్ ప్రారంభించడం చాల సంతోషముగా ఉందన్నారు.
బార్ అసోసియేషన్ అధ్యక్షులు మాడుపురు ప్రసాద్ మాట్లాడుతూ.....అతిరధమరనీయుల చేత ప్రారంభించబోయే అడిషనల్ జిల్లా మరియు సెషన్ కోర్ట్ కొరకు ఈ రోజు నుంచి పనులు ప్రారంభించాము అన్నారు. అలాగే మన న్యాయవాదులకు జిల్లా కోర్ట్ రావడం వల్ల మనకు చేతినిండా పని కలుగుతుందని సంతోషం వ్యక్తం చేశారు. అలాగే శ్రీకాళహస్తి, సత్యవేడు చెట్టుప్రకల మండల గ్రామ ప్రజలందరికీ ఎలాంటి కేసులయిన ఇక్కడే పరిష్కరించుటకు అవకాశం ఉంటుందని తెలిపారు.
No comments:
Post a Comment