నిరుపేద విద్యార్థినికి ఎమ్మెల్యే చేయూత
- ఉన్నత చదువుల కోసం ₹1,00,000/- రూపాయలు సాయం.
- మరోసారి నిరుపేదల పట్ల తన ఉదార్త చాటుకున్న ఎమ్మెల్యే.
నిరుపేదల పట్ల ఎమ్మెల్యే బియ్యపు మసూదన్ రెడ్డి గారు తమ ఉదారతను మరోసారి చూపారు. ఉన్నత చదువుల కోసం ఒక యాదవ విద్యార్థినికి 1లక్ష రూపాయలు అందజేశారు.
వివరాల్లోకి వెళితే శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని,ఏర్పేడు మండలం,సీతారాంపేట గ్రామానికి చెందిన బిల్లు విజయ కుమార్తె బిల్లు గ్రీష్మలత ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఉన్నత చదువులు చదవలేక ఇంటి వద్ద ఉండిపోయింది.ఆ విద్యార్థినికి తండ్రి లేకపోవడంతో ఉన్నత చదువులు భారంగా మారింది. ఈ నేపథ్యంలో గ్రీష్మలత తల్లి విజయ తమ ఆర్థిక పరిస్థితిని ఎమ్మెల్యే గారికి వివరించింది.తన కుమార్తె ఉన్నత(ఇంజనీరింగ్) చదువులు చదువుకోవడం కోసం చిల్లి గవ్వ కూడా లేదని ఎమ్మెల్యేకి వివరించి తమ ఆవేదనను వెళ్లగట్టింది. దీంతో ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి గారు వెంటనే స్పందించి తన ఉదారతను చాటుకుంటూ 1లక్ష రూపాయలు విద్యార్థినికి అందజేశారు.దీంతో గ్రామస్తులు కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలిపారు.
No comments:
Post a Comment