స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
చిత్తూర్ జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని అన్ని ప్రభుత్వ మరియు వివిధ పార్టీ కార్యాలయంలో స్వాతంత్ర వేడుకలు జరిగినది. ముఖ్యముగా కోర్ట్ ఆవరణలో చైర్మన్ కమ్ సీనియర్ సివిల్ జడ్జి డాక్టర్ వై శ్రీనివాసరావు, ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి రాఘవేంద్ర, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి నరేంద్ర రెడ్డి చేతులమీదుగా జండ ను ఎగురవేసి వందనం తెలిపినారు.
ఈ కార్యక్రమంలో కోర్టు సిబ్బంది ,బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ప్రసాద్ ,సీనియర్ న్యాయవాదులు మరియు పారా లీగల్ వాలంటీర్లు పాల్గొన్నారు
అనంతరం న్యాయమూర్తి మాట్లాడుతూ... స్వతంత్ర కోసం పోరాడిన అమరవిరులను యొక్క సేవలను గుర్తుచేసుకొనారు. కరోనా పోయి ప్రజలందరూ ఆరురారోగ్యం తో ఉండాలని కోరినారు.
ఈ ఏడాది మనం 75 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాము. ఆగస్టు 15వ తేదీ ప్రతి భారతీయ పౌరుడికి చాలా ముఖ్యమైన రోజు. ప్రపంచంలో ఎక్కడున్నా.. భారతీయులందరూ ఆగస్టు 15 వ తేదీన స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఘనంగా పండుగలాగా జరుపుకుంటారు.
ప్రతి దేశానికి పరుల పాలన లేదా ఆక్రమణ నుండి విముక్తి లభించిన రోజును స్వాతంత్ర్య దినోత్సవంగా జరుపుకోవడం ఆనవాయితి. దాదాపు రెండు వందల ఏళ్ల బ్రిటిష్ పాలనలో బానిసత్వాన్ని భారత దేశం చవిచూసింది. 1947వ సంవత్సరం ఆగస్టు 15 వ తేదీన మన దేశం ఈ బానిసత్వం నుండి విముక్తిని పొందింది. అప్పటి నుంచి ఆగస్టు 15వ తేదీన మనము స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నాము. ఈ వేడుకలు జరుపుకునేందుకు వీలుగా.. ఆగస్టు 15 తేదీని జాతీయ సెలవు దినంగా పాటిస్తున్నాము.
మనము ఈ రోజు ఇంత స్వేచ్ఛగా ఉన్నామంటే ఎందరో స్వాతంత్ర సమరయోధుల త్యాగాల ప్రతిఫలం. అందుకే వారి త్యాగాలను గుర్తు చేసుకుంటూ మనము స్వాతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకోవాలి. అలాగే వారి త్యాగాలను వృధా కానివ్వకుండా మన దేశ ఉన్నతికి మన వంతు కృషి చేయాలి. వారు ఎలా అయితే మన దేశాన్ని గొప్పగా చూడాలని కలలు కన్నారో.. ఆ కలలను మనమందరం సాకారం చేయాలి. ప్రపంచవ్యాప్తంగా మన దేశ కీర్తిప్రతిష్టలు పెంపొందేలా చెయ్యడం మన బాధ్యత.
No comments:
Post a Comment