మీసేవ కేంద్రమును ఆకస్మిక పరిశీలించిన శ్రీకాళహస్తి ఆర్డిఓ రామారావు
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్నంలోని ప్రసన్న వరదరాజుల స్వామి గుడి ప్రాంగణంలో ఉన్న మీసేవ కేంద్రాన్ని ఆకస్మిక పరిశీలించిన శ్రీకాళహస్తి ఆర్డీవో రామారావు. ముందుగా ప్రజలతో మాట్లాడి మీ సేవలో జరుగు సేవలు వాటి వివరాలు గురించి అడిగి తెలుసుకున్నారు. అలాగే మీసేవలో సేవలు ఎలా అందుతుందని ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా వృద్ధులను, మహిళలను ప్రస్తుతం వారి వచ్చిన పని, అలాగే సేవలు ఎలా జరుగుతుందని అని అడిగి తెలుసుకున్నారు. తర్వాత మీసేవ నిర్వాకులతో ప్రస్తుత ప్రజలకిచ్చు సేవల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నాడు. అనంతరం మీసేవ నిర్వాహకులు ప్రస్తుతం జరుగు సమస్యలపై వివరించారు . అలాగే మీ సేవలో చేయు కుల ఆదాయ ధ్రువీకరణ పత్రాలు సచివాలయం ఉన్న వీఆర్వోలను తిరస్కరిస్తున్నారని అధికారుల దృష్టికి తీసుకొని వెళ్లారు. సానుకూలంగా స్పందించి సంబంధిత అధికారులకు తెలుపుతామని తెలిపారు.
No comments:
Post a Comment