స్విమ్స్ విద్యార్థులకు ఉచిత భోజన సదుపాయం -. టీటీడీ ఈవో శ్రీ ఎ వి ధర్మారెడ్డి - స్వర్ణముఖి న్యూస్

.com/img/a/

NEWS

Home Top Ad

temple%20ad%20%20copy

Post Top Ad

Tuesday, August 2, 2022

demo-image

స్విమ్స్ విద్యార్థులకు ఉచిత భోజన సదుపాయం -. టీటీడీ ఈవో శ్రీ ఎ వి ధర్మారెడ్డి

poornam%20copy

 స్విమ్స్ విద్యార్థులకు ఉచిత భోజన సదుపాయం -. టీటీడీ ఈవో శ్రీ ఎ వి ధర్మారెడ్డి

296249565_3251094908544836_1707099219537976882_n

296274718_3251094981878162_7615227824110847942_n

296274747_3251095171878143_831893110470135505_n

296293755_3251094911878169_4376878323021384541_n

296295646_3251094988544828_6435371217556234732_n

296302905_3251095175211476_3835472542081694596_n

296371790_3251095088544818_4625408081275081858_n

296480278_3251095075211486_7709440895741529265_n

296954380_3251094998544827_1739418255712486192_n


 స్వర్ణముఖిన్యూస్ ,తిరుపతి   :


స్విమ్స్ లో చదువుతున్న ఫిజియో థెరపీ , నర్సింగ్ , పారా మెడికల్ విద్యార్థినీ విద్యార్థులకు టీటీడీ విద్యాసంస్థల్లో లాగా ఉచిత భోజన సదుపాయం కల్పిస్తామని టీటీడీ ఈవో శ్రీ ఎ వి ధర్మారెడ్డి తెలిపారు.
జెఈవో లు శ్రీమతి సదా భార్గవి , శ్రీ వీరబ్రహ్మం , స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ వెంగమ్మ తో కలసి సోమవారం సాయంత్రం ఆయన స్విమ్స్ లోని పలు విభాగాల క్యాంటీన్లను పరిశీలించారు .
స్విమ్స్ లోని రోగులు వారి సహాయకులు ,డాక్టర్లు , ఇతర సిబ్బందికి ప్రత్యేకంగా క్యాంటీన్ సౌకర్యం పెంచేందుకు , బాయ్స్ హాస్టల్లో ఆర్ ఓ ప్లాంట్ ఆధునీకరణకు చర్యలు తీసుకుంటామన్నారు .ఆసుపత్రి వద్ద రోగులు వేచి ఉండే షెల్టర్ ను మరింత అభివృద్ధి చేస్తామన్నారు . యూజి ,పిజి విద్యార్థులు తమ హాస్టల్ ను తామే ఎలా నిర్వహించుకునే విషయంపై కొత్త ప్రతిపాదనలతో రావాలన్నారు . ఆసుపత్రి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు . స్విమ్స్ బయట ఉన్న క్యాంటీన్ ,ఆఫీసర్స్ క్యాంటీన్ , జనరల్ వార్డ్ డైనింగ్ హాల్ , బాలురు ,బాలికల హాస్టల్ ,పిజి హాస్టల్ , పద్మావతి హాస్పిటల్ క్యాంటీన్ లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.
ఎఫ్ ఎ సి ఎ ఓ శ్రీ బాలాజి , చీఫ్ ఇంజినీర్ శ్రీ నాగేశ్వరరావు , శ్రీ పద్మావతి వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ శరన్ , మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రామ్ తదితరులు పాల్గొన్నారు .

No comments:

Post a Comment

Blog Archive

Post Bottom Ad

Pages