పిల్లారి ఫౌండేషన్ ఆధ్వర్యంలో గణిత అష్టావధాన కార్యక్రమం
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని కొత్తపేట లో ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల నందు గణిత అష్టావధానం అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమముకు ముఖ్యఅతిథిగా గణిత అవధాని అరుణ్ శివప్రసాద్ పాల్గొని విద్యార్థులు మరియు అధ్యాపకులకు గణితం పై అవగాహన కార్యక్రమం అందించారు. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో అష్టావధానంలో అప్రస్తుత గణితం, నిషిద్ధ సంఖ్య, క్యాలెండర్, పైథాగరన్ త్రికాలు, మ్యాజిక్స్ స్కోయర్, పంచమమూలము, పై విలువల 100 దశాంశాలు వరకు చేత ప్రైమ్ నంబర్లు భాగించగా వచ్చే బాగా ఫలము...మొదలైన అంశములపై అవగాహన కార్యక్రమం అందించారు.
ఈ కార్యక్రమంలో పిల్లారి ఫౌండేషన్ అధిపతి అమరావతి మరియు పాఠశాల ప్రధానోపాధ్యాయులు, అధ్యాపకులు, వివిధ పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు
పిల్లారి ఫౌండేషన్ అమరావతి మాట్లాడుతూ.... మన విద్యలో ముఖ్యమైన ఘట్టం గణిత శాస్త్రము దానిలో పట్టుత్వమున్నవాళ్లు ఎలాంటి సమస్యనైనా ఎదుర్కొనే శక్తి వస్తుందని అన్నారు. కావున ప్రతి ఒక్కరూ గణిత అష్టావధాని అరుణ శివప్రసాద్ అవగాహన కార్యక్రమము అందరూ వీక్షించి విద్యార్థుల భావి భవిష్యత్తుకు ఉపయోగపడాలని కోరుచున్నాము.
No comments:
Post a Comment