ఒక్కరోజు సమ్మెలో పాల్గొన్న శ్రీకాళహస్తి ప్రధాన తపాలా ఉద్యోగస్తులు
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
అఖిలభారత తపాలా ఉద్యోగుల కేంద్ర నాయకత్వం పిలుపు మేరకు ఈరోజు శ్రీకాళహస్తి ప్రధాన తపాలా కార్యాలయం ఆవరణములో తపాలా P3 ,P4 మరియు GDS ఉద్యోగస్తులు ఒక్కరోజు సమ్మెలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సమ్మె కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా NFPE P3 రాష్ట్ర కార్యదర్శి కా!
బి. శ్రీధర్ బాబు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తపాలా శాఖను ప్రైవేటీకరణ దిశగా చేస్తున్న ప్రయత్నాలను విరమించుకోవాలని పోస్టల్ సేవింగ్స్ బ్యాంక్ ఖాతాలను ఐపిపిబి లోకి విలీనం చేయడని నిలిపివేయాలని కోరారు.మరియు NPS ని రద్దు చేసి ఓల్డ్ పెన్షన్ స్కీంని పునరుద్ధరించాలని కోరారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఆలిండియా జిడిఎస్ జనరల్ సెక్రటరీ కామ్రేడ్!పాండురంగారావు గారు మాట్లాడుతూ తపాలా శాఖలో డెలివరీ సిస్టంలో విక్కీంద్రీకరణ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని డాక్ మిత్ర ,CSCల వంటి ప్రైవేటీకన విధానాన్ని వెంటనే ఆపు చేయాలని ప్రసంగించినారు. పోస్టల్ శాఖలో ఖాళీగా ఉన్న అన్ని క్యాడర్ల పోస్టులు వెంటనే భర్తీ చేయాలని కోరారు.
పిఫోర్ సర్కిల్ ప్రెసిడెంట్ కామ్రేడ్ మురళి గారు మాట్లాడుతూ ఈరోజు జరిగే ఒక్కరోజు సమ్మె ద్వారా ప్రభుత్వ అధికారులు కనువిప్పు కలిగి ఆలోచన విధానం మారాలని హెచ్చరించారు.రాబోయే రోజుల్లో ఉద్యోగులందరూ ఐక్యంగా ఉండి నిరావధిక సమ్మె చేసేదానికి కూడా వెనుకడుగు వేయకుండా ముందుకు వెళ్లాలని చెప్పారు.మన సమస్యలను ప్రశ్నించడానికి ముందుకు వెళ్లాలని దిశా నిర్దేశం చేశారు ఈ కార్యక్రమంలో పిత్రీ బ్రాంచ్ సెక్రటరీ వెంకటేశ్వర్లు గారు, పిఫోర్ బ్రాంచ్ సెక్రటరీ మురళి గారు, జిడిఎస్ బ్రాంచ్ సెక్రటరీ ప్రసన్నకుమార్ గారు మరియు ఉద్యోగ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో పెన్షనర్లు మరియు పోస్టల్ ఏజెంట్లు కూడా పాల్గొన్నారు
No comments:
Post a Comment