దుర్గమ్మ కొండ అంకురార్పణ పూజా కార్యక్రమం
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం అనుబంధాలయమైన కనకాచలం (దుర్గమ్మ కొండ) పై వెలసిన దుర్గమ్మ అమ్మవారి దేవాలయం నందు మూడు రోజుల పాటు బాలాలయ కార్యక్రమాలు దేవస్థానం వారు ఆగముక్తంగా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ అంజూరు తారక శ్రీనివాసులు గారు ముఖ్య అతిథిగా విచ్చేశారు. తొలిరోజులో భాగంగా బుధవారం సాయంత్రం అంకురార్పణ పూజా కార్యక్రమంతో ప్రారంభించారు. ముందుగా కలిశ స్థాపన పుణ్యవచనము, పుష్పాలతో పూజలు చేసి హారతులు పట్టి ఆపై హోమమును నిర్వహించి హోమం యందు పూర్ణాహుతిని హోమం నందు సమర్పించి వాస్తు హోమము నిర్వహించి వేద పండితులకు పట్టు వస్త్రాలను చైర్మన్ అంజూరు శ్రీనివాసులు గారు చేతుల మీదుగా పురోహితులకు అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఆలయ ఎ.ఇ. మల్లిఖార్జున ప్రసాద్, లక్ష్మయ్య, హరి, దుర్గా ప్రసాద్, ఎలక్ట్రికల్ ఎ. ఇ. సుబ్బారెడ్డి, ఆలయ అర్చకులు కరుణాకరణ్ గురుకుల్, నీచు స్వామి, అర్ధగిరి స్వామి,చెంగలరాయులు, గోవిందస్వామి, తేజ, రాఖీ మరియు బాల గౌడ్, తేజ, రాజ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment