ర్యాగింగ్ ను నిర్ములిస్తాం... క్రమశిక్షణతో మెలగాలి, భద్రతతో ఎదగాలి అని పిలుపునిచ్చిన న్యాయమూర్తులు
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
న్యాయ వారోత్సవాల్లో భాగంగా ఈ రోజు శ్రీకాళహస్తి పట్టణంలోని రాయలసీమ జూనియర్ కాలేజ్ లో ర్యాగింగ్ నిర్మూలన పై న్యాయ విజ్ఞాన సదస్సు జరిగింది.
ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ రాఘవేంద్ర, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి నరేంద్ర రెడ్డి , న్యాయవాదులు మల్లికార్జునయ్య, రాజేశ్వరరావు, గరికపాటి రమేష్, అరుణ్, ప్రఘ్నశ్రీ , కళాశాల కరస్పాండెంట్ సుబ్బరామిరెడ్డి, వన్ టౌన్ ఎస్ఐ సంజీవ్ కుమార్, మండల లీగల్ సర్వీస్ కమిటీ సభ్యులు , పారా లీగల్ వాలంటరీ లు , కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
న్యాయమూర్తులు మాట్లాడుతూ... కళాశాల విద్యార్థులు సమాజంలో ఎలా మెలగాలి అని క్లుప్తంగా వివరించారు. కాలేజ్ లలో జరిగే ర్యాగింగ్, మత్తు పదార్థాలు కి బానిసకు కాకుండా చూసుకోవాలి, గుడ్ టచ్ మరియు బ్యాడ్ టచ్ గూర్చి ఫండమేంటల్ డ్యూటీస్ మరియు రైట్స్ గూర్చి వివరించారు.మీకు ఏ సమస్య ఉన్న 15100 కు కాల్ చేస్తే ఉచిత న్యాయ సలహాలు ఇస్తారన్నారు.అలాగే దిశ యాప్ ను ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలని కొరడమైనది. మీరు బయట వెల్లేటప్పుడు చుట్టుప్రక్కల పరిసితు గమనిస్తుండాలి. సందేహమువుంటే మీ కాలేజ్ అధ్యాపకులకు, లేదా దగ్గరలో వున్నా పోలీస్ లకు తెలపాలని అన్నారు.. ఎందుకంటే మన సంరక్షణ ,,మన బాధ్యతలు మరియు జాగ్రత్తలు మనమే చూసుకోవాలని అని తెలిపారు.
No comments:
Post a Comment