శ్రీకాళహస్తి పట్టణంలోని హర్ ఘర్ తిరంగా ర్యాలీ
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
ఆజాదికా అమృత్ మహోత్సవ వేడుకలలో భాగంగా శ్రీకాళహస్తి పట్టణంలోని జడ్పీ బాలుర ఉన్నత పాఠశాల నందు "హర్ ఘర్ తిరంగా ర్యాలీ" కార్యక్రమంలో పాల్గొన్ని స్వాతంత్య్ర సమరయోధుల చిత్రపటాలతో విద్యార్థులతో,మహిళలతో 1000అడుగుల జాతీయ జెండాను పట్టుకుని శ్రీకాళహస్తి పట్టణంలోని నాలుగు మాడవీధులలో దాదాపు 5000 మందితో భారీ ర్యాలీ నిర్వహించిన ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి .
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ,ఆజాదికా అమృత్ కార్యక్రమాన్ని చేపట్టిన ప్రధానమంత్రి నరేంద్రమోడీ కృతజ్ఞతలు తెలియజేశారు.దేశభక్తి కలిగిన నరేంద్రమోడీ దేశప్రజలను చైతన్యవంతులను చేయడానికి హర్ ఘర్ తిరంగా కార్యక్రమం చేపట్టడం ఈ కార్యక్రమాన్ని రాష్ట్రంలో ముఖ్యమంత్రివర్యులు జగన్మోహన్ రెడ్డి తమ నాయకులచే నిర్వహింపచేయడం శుభ పరిణామం తెలియజేశారు.దేశ సమైక్యత, సమగ్రతను చాటి చెప్పేలా ప్రతి ఒక్కర్లో జాతీయ భావం కలిగి ప్రతి ఇంటిపై జాతీయ పతాకాన్నిఎగరవేయాలని ప్రజలకు తెలియజేశారు,తిరంగా విద్యార్థుల్లో స్ఫూర్తిని నింపిందన్నారు.
ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి దేవస్థానం పాలకమండలి చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు మరియు బోర్డు సభ్యులు,గుమ్మడి బాలకృష్ణయ్య,లోకేష్ యాదవ్, పగడాల రాజు,కంఠ ఉదయ్ కుమార్,కొల్లూరు హరి నాయుడు, డిష్ ధర్మయ్య, సిరాజ్,గోరా,ఫజల్,సెన్నిరూ కుప్పం శేఖర్,శ్రీవారి సురేష్,సునీత సింగ్,రామచంద్ర రెడ్డి,నందా,గణేష్,శ్రీకాళహస్తి పురపాలక సంఘం కమిషనర్ బాలాజీనాయక్, మెప్మా మహిళలు,మరియు వైకాపా నాయకులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment