అంగరంగ వైభవంగా శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు.
సెప్టెంబర్ 27 నుండి అక్టోబర్ 5.
బ్రహ్మోత్సవ తొలిరోజైన సెప్టెంబర్ 27న సాయంత్రం ముఖ్యమంత్రివర్యులు శ్రీ వైఎస్.జగన్‌మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాల సమర్పణ.
బ్రహ్మోత్సవాల్లో విశేష ఉత్సవాలు.
అక్టోబరు 1 గరుడ సేవ,
అక్టోబర్ 2 స్వర్ణరథం,
అక్టోబర్ 4 రథోత్సవం,
అక్టోబర్ 5 చక్రస్నానం.
తొలిరోజు ధ్వజారోహణం కారణంగా రాత్రి 9 గంటలకు పెద్దశేష వాహనసేవ.
మిగతా అన్ని రోజుల్లో ఉదయం 8 నుండి 10 గం.ల వరకు, రాత్రి 7 నుండి 9 గం.ల వరకు వాహనసేవలు.
కరోనా కారణంగా రెండేళ్ల తరువాత తిరు మాడ వీధుల్లో శ్రీవారి బ్రహ్మోత్సవ వాహనసేవలు నిర్వహించేందుకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్న టీటీడీ.
తిరుమలశ్రీవారి బ్రహ్మోత్సవాల్లో
సామాన్య భక్తులకు ప్రాధాన్యత.
సర్వదర్శనం మాత్రమే అమలు.
ఆర్జిత సేవలు, శ్రీవాణి, విఐపి బ్రేక్ దర్శనాలు, రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శనం, వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లల తల్లిదండ్రులకు ప్రత్యేక దర్శనం తదితర ప్రివిలేజ్డ్ దర్శనాలు రద్దు.
పెరటాసి మాసం,రెండో శనివారం నాడు గరుడసేవ రావడంతో రద్దీకి అనుగుణంగా విస్తృత ఏర్పాట్లు.
భక్తులకు సమృద్ధిగా అన్న ప్రసాద వితరణ
భక్తుల రద్దీకి తగ్గట్టు ప్రతిరోజూ 9 లక్షల లడ్డూలు అందుబాటు.
భక్తుల కోసం తిరుమల,అలిపిరి లో తాత్కాలిక వసతి ఏర్పాట్లు.
గరుడ సేవ రోజు
అన్ని వాహనాలకు రింగ్ రోడ్డు లోనే పార్కింగ్ ఏర్పాటు.
రింగ్ రోడ్ నుండి
భక్తులను ఉచిత ధర్మ రథం బస్సుల ద్వారా తిరు మాడ వీధుల వరకు తరలించేలా ఏర్పాట్లు .
24/7 కంట్రోల్ రూమ్, సిసి కెమెరాలతో నిఘా.
పటిష్ట భద్రతా ఏర్పాట్లు
అలిపిరి వద్ద ద్విచక్ర వాహనాలు, నాలుగు చక్రాల వాహనాలకు ప్రత్యేకంగా పార్కింగ్ సౌకర్యం.
శ్రీవారి ఆలయం, అన్ని ముఖ్య కూడళ్లలో దేదీప్యమైన విద్యుత్ దీపాలంకరణలు.
బ్రహ్మోత్సవ సమయంలో 3,500 మంది శ్రీవారి సేవకుల సేవలు.
తిరుమల తో పాటు అలిపిరి , తిరుపతిలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో స్పెషలిస్టు డాక్టర్లు, ప్రథమ చికిత్స కేంద్రాలు, 10 ప్రత్యేక అంబులెన్సుల ఏర్పాటు.
బ్రహ్మోత్సవాలకు హాజరయ్యే భక్తులు తప్పనిసరిగా మాస్క్ ధరించాలి.
ఎపిఎస్ఆర్‌టిసి ద్వారా తగినన్ని బస్సులు. గరుడసేవ రోజున ఎక్కువ బస్సులు.
తిరుమల-తిరుపతి ఘాట్ రోడ్లలో గరుడసేవ నాడు పూర్తిగా, మరుసటి రోజు మధ్యాహ్నం 12 గంటల వరకు ద్విచక్ర వాహనాల రాకపోకల పూర్తి నిషేధం.
శ్రీవారి వాహనసేవల ముందు విభిన్న కళారూపాలు, సాంస్కృతిక కార్యక్రమాల ఏర్పాటు.
ప్రత్యేకంగా గిరిజన ప్రాంతాల కళాకారులకు అవకాశం.
No comments:
Post a Comment