స్వాతంత్య్ర సమరయోధుడు పింగళి వెంకయ్య 146 వ జయంతి
స్వర్ణముఖిన్యూస్ ,తిరుపతి :
జాతీయ పతాక రూపకర్త, స్వాతంత్య్ర సమరయోధుడు పింగళి వెంకయ్య 146 వ జయంతి ఉత్సవాలను ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా జిల్లా యస్.పి శ్రీ పి.పరమేశ్వర రెడ్డి, ఐ.పి.యస్ గారి ఆదేశాల మేరకు అడిషనల్ యస్.పి అడ్మిన్ శ్రీమతి ఇ.సుప్రజ మేడం ఎస్పి ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఘనంగా త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు.
అడిషనల్ యస్.పి అడ్మిన్ మేడం మాట్లాడుతూ పింగళి వెంకయ్య ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా మొవ్వ మండలం భట్లపెనుమర్రులో 1876 ఆగస్టు 2 న పింగళి వెంకయ్య జన్మించారు
1916 వ సంవత్సరం, దేశానికి స్వాతంత్య్రం సాధించే విధానాలపై లక్నోలో దేశ నాయకులు తీవ్రంగా చర్చిస్తున్నారు. అదే సమయంలో ఒక బక్క పలచని వ్యక్తి తన చేతిలోని పుస్తకాన్ని చిన్న వస్త్రాన్ని కనిపించిన ప్రతి నేతకూ చూపిస్తు తన ప్రతిపాదనపై ఆలోచించాలని కోరడమైనది, ఆ సమయంలో ఎవ్వరూ పట్టించుకోలేదు.
అయితే ప్రతి ఏడాది దేశ నాయకులు ఎక్కడ సమావేశమైతే అక్కడికి వెళ్లడం, వారిని కలవడం ఆయనకు పరిపాటిగా మారింది. ఇలా అయిదేళ్లకు ఆయన కల నెరవేరింది యావత్ భారతానికి త్రివర్ణ పతాకమై అందింది. తన పట్టుదలతో దేశానికి త్రివర్ణ జెండాను అందించిన వ్యక్తి మన పింగళి వెంకయ్య.
పింగళి వెంకయ్య మొక్క బోని పట్టుదల కృషితో విజయం సాధించారు. అలా మీరు కూడా ఏ పనినైనా పట్టుదల అత్మ విశ్వాసంతో సాధించాలని ఆశిస్తున్నానని తెలిపారు.
ఈ కార్యక్రమాలు జిల్లా వ్యాప్తంగా ఎస్పి గారి ఆదేశాలపై ప్రతి పోలీస్ స్టేషన్ లొ ఘనంగా జరిగింది.
ఈ సందర్భంగా ఏ.ఓ శ్రీమతి వనజాక్షి మేడం , డి.సి.ఆర్.బి సి.ఐ చంద్రశేఖర్ పిళ్ళై, ఆర్.ఐ అడ్మిన్ చంద్రశేఖర్, మరియు డి.పి.ఓ సిబ్బంది పాల్గొన్నారు.
No comments:
Post a Comment