మట్టి విగ్రహాలనే పూజించండి , ప్లకార్డులతో స్కౌట్స్ అండ్ గైడ్స్ అవగాహన ప్రదర్శనలు
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
వినాయక చవితి ఉత్సవాలలో మట్టి వినాయకులని పూజించండని భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఆధ్వర్యంలో శ్రీకాళహస్తిలో ప్రజలకు అవగాహన కల్పించారు. పట్టణంలోని పెళ్లి మండపం, బేరివారి మండపం, ఆర్టీసీ బస్టాండ్, సూపర్ బజారు కూడాలి, శ్రీకాళహస్తీశ్వరస్వామి బిక్షాల గోపురం తదితర ప్రాంతాలలో ప్లకార్డులు చేతపట్టి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా రాష్ట్ర స్కౌట్స్ మండలి మాజీ సభ్యులు టి. రమేష్ బాబు మాట్లాడుతూ వినాయక చవితి సందర్భంగా అందరు కాలుష్య రహిత మట్టి విగ్రహాలను పూజించడం వల్ల కాలుష్యం నుండి పర్యావరణాన్ని కాపాడినట్లు అవుతుందని అన్నారు. ప్రాంతాలలో పట్టణంలోని బాబుగ్రహారం, సరస్వతి బాయ్ మునిసిపల్ ఉన్నత పాఠశాల, జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలకు చెందిన స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులు ప్లకార్డ్స్ పట్టుకొని మట్టి విగ్రహాలు పూజించండి అంటూ ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమాన్ని భిక్షాల గోపురం వద్ద చూసిన శ్రీకాళహస్తి ఆర్డీఓ రామారావు స్కౌట్స్ అండ్ గైడ్స్ చేస్తున్న ప్రయత్నాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో స్కౌట్ మాస్టర్ అజారుద్దీన్, లీడర్లు సుబ్రహ్మణ్యం, మహేంద్ర తదితరులు పాల్గొన్నారు
No comments:
Post a Comment