పేద పిల్లలకు అండగా నిలవడం అదృష్టంగా భావిస్తున్నా
సామాను శ్రీధర్ రెడ్డి(SSR)
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
పేద పిల్లలకు అండగా నిలవడం అదృష్టంగా భావిస్తున్నానని ప్రముఖ సంఘ సేవకులు, సామాను శ్రీధర్ రెడ్డి (ఎస్ఎస్ఆర్) చెప్పారు. శ్రీకాళహస్తి పట్టణంలోని ఆర్ఆర్ బీ కల్యాణ మండపంలో శుక్రవారం సుకన్య సమృద్ధి యోజన పథకం కింద బాలికలకు పాసు పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి సామాను శ్రీధర్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈయనను పోస్టాఫీసు అధికారులు పోస్టల్ స్టాంపు ఇచ్చి పూలమాలతో శాలువాతో ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సామాను శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ... సుకన్య సమృద్ధి యోజన పథకం కింద శ్రీకాళహస్తి, బుచ్చినాయుడుకండ్రిగ, కేవీబీపురం మండలాలకు చెందిన వెయ్యి మంది బాలికలకు ఒక్కొక్కరికి రూ.250 వంతున మొత్తం రూ.2.50లక్షలు తాను చెల్లించినట్లు చెప్పారు. ఇలా పేదల పిల్లలకు సేవ చేసే భాగ్యం కలగడం చాలా ఆనందంగా ఉందన్నారు. వారి కళ్లలోని ఆనందం తనకు ఎంతో సంతృప్తి ఇస్తోందన్నారు. ఇలా పేదలకు సేవ చేసుకునే అవకాశం కొందరికే లభిస్తుందన్నారు. అందులో తాను ఉండటం అదృష్టంగా భావిస్త్తున్నానని సామాను శ్రీధర్ రెడ్డి చెప్పారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తానన్నారు. ఇప్పటికే తాను కొన్నేళ్లుగా పలు సేవా కార్యక్రమాలు చేస్తున్న సంగతి ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. పేదలకు సేవ చేయడంలో ఉన్న సంతృప్తి ఎందులోనూ ఉండదన్నారు. ఇక పోస్టల్ అధికారులు మాట్లాడుతూ... సామాను శ్రీధర్ రెడ్డి వంటి ఉన్నత మనసు గల వ్యక్తులు సమాజంలో అరుదుగా ఉంటారన్నారు. ఆయన వలన వెయ్యి మంది పేద బాలికలకు మేలు జరిగిందన్నారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి పేద వారికి అండగా నిలుస్తానని సామాను శ్రీధర్ రెడ్డి హామీ ఇవ్వడం తమకు ఆనందంగా ఉందన్నారు. ఈ అవకాశం పేద బాలికలు వినియోగించుకోవాలని వారు కోరారు. అనంతరం తపాల సిబ్బందిని ఎస్ఎస్ఆర్ జ్ఞాపకను అందజేసి శాలువాతో ఘనంగా సత్కరించారు .ఈ కార్యక్రమంలో సీనియర్ సూపరింటెండెంట్ జాఫర్ సాదిక్, ఇన్స్ పెక్టరు మణిగండన్, హెడ పోస్టు మాస్టర్ కృష్ణమూర్తి, కిరణ్ కుమార్, వాసుదేవ, సుబ్రహ్మణ్యం, మురళి తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment