యోగివేమన మరియు సుమతి శతక పద్యాల పై పోటీలను నిర్వహించడం జరిగినది.
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
ఈ రోజు నేతాజీ సుభాష్ చంద్రబోస్ వర్ధంతిని పురస్కరించుకొని నాగమల్లి కృష్ణమూర్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో యోగివేమన మరియు సుమతి శతక పద్యాల పై పోటీలను నిర్వహించడం జరిగినది. ఆర్పిబిఎస్ జడ్పీ బాయ్స్ హై స్కూల్ శ్రీకాళహస్తి నందు ఉదయం 10 గంటలకు ఆ స్కూల్ ప్రధాన ఉపాధ్యాయురాలు శ్రీమతి కుమారి రాజేశ్వరి గారి అధ్యక్షతన, కేతారి. రాఘవులు విశ్రాంత తెలుగు పండితులు, మరియు పుల్లూరు. రామకృష్ణయ్య గారు విశ్రాంత తెలుగు పండితులు, న్యాయ నిర్ణయతలుగా వ్యవహరించారు. రామయ్య గారు విశ్రాంత అసిస్టెంట్ ఇంజనీర్ ఏపీ ట్రాన్స్కో అతిథిగా విచ్చేయగా, అనాధ విద్యార్థిని, విద్యార్థులు మరియు ప్రత్యేక ప్రతిభావంతులు ఎనిమిదో తరగతి నుండి పదవ తరగతి చదువుతున్న విద్యార్థులు కొత్తపేట బాలికల ఉన్నత పాఠశాల, బాబు అగ్రహారం ఉన్నత పాఠశాల, సరస్వతి బాయ్ ఉన్నత పాఠశాల తెలుగు గంగ కాలనీ, మరియు ఆర్పిబిఎస్ జెడ్పీ బాయ్స్ హై స్కూల్ విద్యార్థినీ విద్యార్థులు పోటీలలో ఉత్సాహంగా పాల్గొనడం జరిగినది .ఈ కార్యక్రమానికి నాగమల్లి కృష్ణమూర్తి ఫౌండేషన్ అధ్యక్షులు నాగమల్లి రాజశేఖర్ అలంధారి. మని, పెనుగొండ. రవికుమార్ , మల్లికార్జున, బిఎస్. రామయ్య, పత్తి. జ్యోతిరావు, పూల.చంగల్ రాయులు, యోగానంద్ తదితరులు పాల్గొనడం జరిగినది. అతిధులు నేటి కాలానికి వేమన సుమతి శతక పద్యాల విశిష్టతను గురించి భావి భారత పౌరులకు వివరించడం జరిగినది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ కు అందరూ ఘన నివాళి అర్పించడం జరిగినది. న్యాయ నిపుణులు నిర్ణయం ప్రకారం ఆగస్టు 22వ తేదీ సోమవారం పోటీలలో గెలుపొందిన విజేతలకు బహుమతి ప్రధానోత్సవం నిర్వహించబడునని, నాగమల్లి కృష్ణమూర్తి ఫౌండేషన్ అధ్యక్షులు రాజశేఖర్ మరియు కమిటీ సభ్యులు తెలియజేయడం జరిగినది .
No comments:
Post a Comment