భగవద్గీత లోని బోధనలు తెలుసుకోవాలి : పవార్
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
శ్రీ కృష్ణ నుని తత్త్వం తెలుసుకోవాలంటే భగవద్గీత ను ప్రతిఒక్కరూ చదవాలని ది స్కూల్ కరస్పాండెంట్ జనార్థన్ రావు జె.పవార్ అన్నారు. శుక్రవారం శ్రీకృష్ణాష్టమి సందర్భంగా ది స్కూల్ లో వేడుకలు ఘనంగా నిర్వహించారు. శ్రీకృష్ణుని విగ్రహానికి ప్రత్యేక పూజల అనంతరం ఉట్టి కొట్టే కార్యక్రమం జరిగింది. చిన్న పిల్లలు శ్రీకృష్ణ, గోపిక వేషధారణ లో నాట్య ప్రదర్శనలు చేశారు. ఈ కార్యక్రమంలో హెడ్ మిస్ట్రెస్ పి. విశాల, ఉపాద్యాయ బృందం, తల్లి దండ్రులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment