భవిత ప్రతేక ప్రతిభావంతుల అవగాహన కార్యక్రమం
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
న్యాయ వారోత్సవాల్లో భాగంగా జిల్లా కోర్టు వారి ఆదేశాల మేరకు ఈరోజు శ్రీ కాళహస్తి పట్నంలోని ఎంఈఓ కార్యాలయ ప్రాంగణంలో భవిత ప్రతేక ప్రతిభావంతుల పాఠశాలలో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేసారు.
ఈ కార్యక్రమంలో ఎంఈఓ భువనేశ్వరి, న్యాయవాదులు రాజేశ్వరరావు, అరుణ్, రమేష్ బాబు మరియు కోర్టు సిబ్బంది,పారా లీగల్ వాలంటరీలు పాల్గొన్నారు.
విద్యార్థుల తల్లిదండ్రులు కొన్ని సమస్యలను న్యాయవాదులు అర్జీ రూప అందించారు . వీటిలో ముఖ్యంగా వాన కురిసినప్పుడు భవనము బాగా కురుస్తుందని తెలిపారు. మరియు విద్యార్థులు మలవిసర్జన చేయుట వెళ్లేటప్పుడు పరికరాలు నిరుపయోగ కరoగా ఉందని తెలిపారు. అలాగే భవనము పాతదైపోయి రంగులు కూడా మారిపోయింది అని తెలిపారు
కావున పై సమస్యలు గౌరవ సీనియర్ సివిల్ జడ్జి దృష్టికి ఈ సమస్య తీసుకొనివెళతం అని అన్నారు మీ కేదైనా సమస్యవుంటే 100 ఫోన్ నెంబర్ గాని 15100 ఫోన్ నెంబర్ గాని తెలియజేయవలసిందిగా కోరారు.
No comments:
Post a Comment