గోరంట్ల మాధవ్ వెంటనే ఎంపీ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ :బొజ్జల సుధీర్ రెడ్డి
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
నాడు తెలుగువారి ఆత్మగౌరవన్ని ఢిల్లీ లో నిలిపిన తెలుగుదేశం, నేడు తెలుగువారి ఆత్మగౌరవన్ని తాకట్టు పెట్టిన వైసీపీ
పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం.
సోమిరెడ్డి కామెంట్స్...
* గోరంట్ల మాధవ్ రాసలీలల వ్యవహారంతో దేశంలో తెలుగు ప్రజల ఆత్మ గౌరవానికి భంగం కలిగింది.
* చట్టసభల్లో ఉండే ఒక పార్లమెంటు సభ్యుడు వ్యవహరించిన తీరుతో భారతదేశం తలదించుకునే పరిస్థితి ఏర్పడింది.
* నాడు తెలుగు ప్రజల ఆత్మ గౌరవాన్ని ఢిల్లీలో నందమూరి తారక రామారావు నిలబెట్టిన విషయాన్ని గుర్తు చేశారు.
* ఈ వైసీపీ ఎంపీ ఈరోజు ఢిల్లీ వీధుల్లో తెలుగువారి ఆత్మ గౌరవాన్ని మంట గలిపారని వ్యాఖ్యానించారు.
* గోరంట్ల రాసలీలల వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.. అయినా వైసీపీ సలహాదారు సదర రామకృష్ణారెడ్డి ఒరిజినలా కాదా అనే పరిశీలన చేస్తున్నామనడం వారి విజ్ఞతను తెలియజేస్తోంది.
లోకసభ స్పీకర్ తన విచక్షణాధికారాలను ఉపయోగించి వెంటనే ఈ రాసలీల ఎంపీ గోరంట్ల ను పార్లమెంటు నుంచి భర్తల చేయాలని డిమాండ్ చేశారు.
బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ గతంలో తెలుగుదేశం పార్టీ తెలుగు ఆత్మగౌరవన్ని నిలబెడితే, నేడు వైసీపీ తెలుగు వారి ఆత్మగౌరవన్ని తాకట్టు పెట్టింది,మాధవ్ వెంటనే ఎంపీ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
నరసింహ యాదవ్ మాట్లాడుతూ మహిళలకు ఆస్తిలో సమాన హక్కు తెలుగుదేశం పార్టీ ఇస్తే ఇపుడు వైసీపీ మహిళల పట్ల ఆమణికంగా ప్రవర్తిస్తున్నారు.
కురుగుండ్ల రామకృష్ణ , నెలవల సుబ్రహ్మణ్యం ,పాశం సునీల్ ,జేడీ రాజశేఖర్ మాట్లాడుతూ మాధవ్ అలాంటి ప్రవర్తన వారి ఇంట్లో చేసుకోవాలి కానీ ఇలా సమాజం పై పడితే ఎలా అని ప్రశ్నించారు, ఎందరో మహానుభావులు కూర్చున్న సభలో ఇలాంటి వారిని కూర్చోబెట్టడం బాధాకరమని, వైసీపీ పార్టీ ఎవరు కళ్ళు పట్టితే, ఎవరు ఎక్కువ బూతులు మాట్లాడితే వారికి పదవులు కట్టబెట్టాడ్డం దారుణమన్నారు, వెంటనే మాధవ్ ని సస్పెండ్ చేసి శిక్షించాలని డిమాండ్ చేసారు
ఈ సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి,తిరుపతి పార్లమెంట్ అధ్యక్షులు నరసింహ యాదవ్, శ్రీకాళహస్తి నియోజకవర్గం టిడిపి ఇన్చార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డి, వెంకటగిరి మాజీ ఎమ్మెల్యే రామకృష్ణ, సత్యవేడు ఇంచార్జి జేడీ రాజశేఖర్, గూడూరు ఇంచార్జి మాజీ ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్, సూళ్లూరుపేట ఇంచార్జి నెలవల సుబ్రహ్మణ్యం, రాష్ట్ర కార్యదర్శి శ్రీకాళహస్తి పరిశీలకులు మల్లిశెట్టి వెంకటేశ్వర్లు, రాష్ట్ర కార్యదర్శులు గురువారెడ్డి, చలపతి నాయుడు, దశరధ ఆచారి, తిరుపతి పార్లమెంట్ మహిళా అధ్యక్షురాలు ఉష,చెంచయ్య నాయుడు,విజయ్ కుమార్, మురళి నాయుడు, పొన్నారావు,మిన్నల్ రవి,జిలాని బాషా, సుబ్బయ్య, నియోజకవర్గం సంబంధించిన నాయకులు పాల్గొన్నారు
No comments:
Post a Comment