ముక్కంటిని దర్శించుకున్న A.P.S.R.T.C మేనేజంగ్ డైరెక్టర్ ద్వారకా తిరుమలరావు I.P.S
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
ప్రముఖ శైవ క్షేత్రాలలో ప్రసిద్ధిగాంచిన శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత వాయులింగేశ్వరుడు కొలువు తీరివున్న శ్రీకాళహస్తి క్షేత్రమునకు A.P.S.R.T.C మేనేజంగ్ డైరెక్టర్ ద్వారకా తిరుమలరావు I.P.S విచ్చేశారు. వారికి శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ట్రస్ట్ బోర్డు ఛైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు దక్షిణ గోపురం వద్ద ఆలయ అర్చకులతో వేదమాంత్రాలతో, పూలమాలలు వేసి ఘన స్వాగతం పలికారు. స్వామి-అమ్మవార్ల ప్రత్యేక పూజలతో దర్శనం చేయించి దక్షిణామూర్తి సన్నిధి వద్ద వారికి శేష వస్త్రాలతో సత్కరించి, స్వామి-అమ్మ వార్ల చిత్రపటాన్ని మరియు తీర్థ ప్రసాదాలను అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఆలయ అధికారి A.C. మల్లిఖార్జున ప్రసాద్, సుదర్శన్, పోలీస్ శాఖ అధికారులు D.S.P విశ్వనాధం, C.I అంజూ యాదవ్, శ్రీకాళహస్తి డిపో మేనేజర్ రాజ వర్ధన్ రెడ్డి మరియు డిపో అధికారులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment