వినాయక చవితి సందర్భంగా 20,000 మట్టి వినాయక ప్రతిమలను ప్రజలకు అందజేయనున్న శ్రీకాళహస్తి ఎమ్మెల్యే
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
మట్టి విగ్రహాలతో గణపతిని పూజిద్దాం మన భవిష్యత్తు కోసం పర్యావరణాన్ని కాపాడుకుందాం - MLA బియ్యపు మధుసూదన్ రెడ్డి
•20,000 మట్టి వినాయక ప్రతిమలను శ్రీకాళహస్తి ప్రజలకు ఉచితంగా అందజేసిన ఎమ్మెల్యే .
•పర్యావరణాన్ని కాపాడడం కోసం ప్రతి ఒక్కరికి చెట్లను కూడా అందజేశారు.
వినాయక చవితి శుభసందర్బంగా ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మట్టి విగ్నేశ్వరుని ప్రతిమలను శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రజలకు అందజేసిన MLA బియ్యపు మధుసూదన్ రెడ్డి .
శ్రీకాళహస్తి పట్టణంలోని ZP BOY'S హై స్కూల్ మరియు GIRL'S హై స్కూల్, ఏర్పేడు మరియు రేణిగుంటలో 20,000 మట్టి వినాయక ప్రతిమలను మరియు పర్యావరణాన్ని కాపాడడం కోసం చెట్లను ప్రజలకు ఉచితంగా పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ, జగనన్న ఆదేశాల మేరకు పర్యావరణాన్ని కాపాడుకోవడం కోసం శ్రీకాళహస్తి నియోజకవర్గంలో 20వేల వినాయక స్వామి మట్టి బొమ్మలను మరియు చెట్లను పంపిణీ చేయడం జరిగింది.కావున ప్రతి ఒక్కరు వారి ఇళ్లల్లోనే మట్టి విగ్రహాలు పెట్టుకొని పూజించి,ఆ మట్టి గణపతి విగ్రహాలను ఇంటిలోనే నిమజ్జన చేసుకొని, అందులో పూల మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణ కై ,మానవ జీవితం మనుగడకై , ప్రతి ఒక్కరు దోహదపడాలని కోరారు.
అనంతరం శ్రీకాళహస్తి నియోజకవర్గం ప్రజలకు ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి దేవస్థానం చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు మరియు బోర్డు సభ్యులు,కొల్లూరు హరినాయుడు, కంఠ ఉదయ్ కుమార్,శ్రీవారి సురేష్,కంచి గురవయ్య, సబ్బరయులు,ఆర్కొడ్ శేఖర్,అట్ల రమేష్,గఫూర్,బాబు,గణేష్, సమీర్,మని,విజయ్,శ్రీను తదితరలు పాల్గోన్నారు.
No comments:
Post a Comment