ఎటు చూసినా త్రివర్ణ పతాకం. గ్రామ, పట్టణాల్లో సంబరాలు జరుపుకున్న విద్యార్థిని విద్యార్థులు. - స్వర్ణముఖి న్యూస్

 స్వర్ణముఖి న్యూస్

NEWS

Breaking

Home Top Ad

Post Top Ad

Friday, August 12, 2022

ఎటు చూసినా త్రివర్ణ పతాకం. గ్రామ, పట్టణాల్లో సంబరాలు జరుపుకున్న విద్యార్థిని విద్యార్థులు.

ఎటు చూసినా త్రివర్ణ పతాకం. గ్రామ, పట్టణాల్లో సంబరాలు జరుపుకున్న విద్యార్థిని విద్యార్థులు.
తిరుపతి పోలీసు వారి ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ ఉత్సవాల వేడుకలు.










జిల్లా ఎస్పీ శ్రీ.పి.పరమేశ్వర రెడ్డి, ఐ.పి.యస్ వారి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా పోలీసులు మరియు విద్యార్థిని విద్యార్థులు భారీ త్రివర్ణ పతాకాన్ని చేతబూని హెరిటేజ్ ర్యాలీలను నిర్వహించారు.
భారతదేశానికి స్వతంత్రం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వేళ నిర్వహిస్తున్న ఆజాది కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా హెరిటేజ్ వాక్ ర్యాలీలను జిల్లా వ్యాప్తంగా మరియు తిరుపతి నగరమంతా కన్నుల పండుగా నిర్వహించారు.
వేలమంది విద్యార్థులు జాతీయ జెండా చేతబూని భారత్ మాత కి జై అని ఆనంద కేరింతల మధ్య ఈ కార్యక్రమం కొనసాగింది.
పోలీస్ వారి ఆధ్వర్యంలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు, అటల పోటీలలో విద్యార్థిని విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా సబ్ డివిజన్ పోలీస్ అదికారులు, సిబ్బంది, మహిళా సిబ్బంది పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Blog Archive

Post Bottom Ad