దోమల నివారణకు ప్రతి ఒక్కరు సహకరించాలని కోరిన డాక్టర్లు ,నర్సులు మరియు ఆశ కార్యకర్తలు.
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
ప్రపంచ దోమల దినోత్సవ సందర్భంగా తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్నంలోని సాలిపేట, గజేంద్ర నగర్ పరిధిలో వైద్య బృందం ర్యాలీ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో గజేంద్ర నగర్ లో ఉన్న అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్కు సంబంధించిన వైద్య బృందం అయిన డాక్టర్ గిరిజా ప్రకాశం మరియు సబ్ యూనిట్ అధికారి శివకుమార్, కమ్యూనిటీ ఆర్గనైజర్ రేవతి, వార్డు సచివాలయ నర్సులు మరియు ఆశా కార్యకర్త లు పాల్గొన్నారు..
డాక్టర్లు మాట్లాడుతూ.... ఈ కార్యక్రమంలో భాగంగా దోమల పెరుగుదల దశలను, ఇంకా మలేరియా పరానా జీవిని కనుగొన్న డాక్టర్ సర్ రోనాల్డ్ రాస్ చిత్రపటానికి నివాళులర్పించి, అనంతరం ర్యాలీని ప్రారంభించారు. ఇందులో భాగంగా డాక్టరు గారు,నర్సులు మరియు ఆశా కార్యకర్తలు చుట్టుపక్కల ప్రజలకు దోమలపై అవగాహన కల్పించారు. దోమల ద్వారా వ్యాపించే వ్యాధుల గురించి, దోమల పెరుగుదల దశ గురించి, ఇంకా దోమల వల్ల కలిగే వ్యాధులు, వాటి నివారించడానికి చేయవలసిన పద్ధతులను వివరించారు.
No comments:
Post a Comment