సుప్రీంలో కీలక ముందడుగు.. కేసుల విచారణ ప్రత్యక్ష ప్రసారం..
దిల్లీ: అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును ప్రజలకు చేరువ చేసే క్రమంలో కీలక ముందడుగు పడింది.కోర్టు చరిత్రలో తొలిసారి ప్రొసీడింగ్స్ ప్రత్యక్ష ప్రసారం చేశారు. సీజేఐ ధర్మాసనం విచారణ ప్రత్యక్ష ప్రసారానికి జస్టిస్ ఎన్వీ రమణ ప్రత్యేకంగా చొరవ తీసుకున్నారు. ఈ రోజు ఆయన పదవీ విమరణ చేయనున్న నేపథ్యంలో.. అత్యున్నత న్యాయస్థానంలో ఈ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ సందర్భంగా అన్ని కోర్టుల నుంచి ప్రత్యక్ష ప్రసారం జరగాలని ఆయన ఆకాంక్షించారు. జస్టిస్ ఎన్వీ రమణ పదవీ విరమణ సందర్భంగా న్యాయవాదులు భావోద్వేగానికి గురయ్యారు. ఆయన పనితీరుపై ప్రశంసలు కురిపించారు. ఆయన ఉన్నత ప్రమాణాలను నెలకొల్పారని కొనియాడారు.
ఉచితాలపై త్రిసభ్య ధర్మాసనం ఏర్పాటు..
ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ఇచ్చేఉచిత హామీల అమలు అంశం తేల్చేందుకు సుప్రీం కోర్టు తిసభ్య ధర్మాసనాన్ని ఏర్పాటు చేసింది. 2013 నాటి తీర్పు పునః పరిశీలనకు కోర్టు ఆమోదం తెలిపింది. ఈ ఉచిత హామీల అమలు సాధ్యాసాధ్యాలపై నిపుణుల కమిటీ ఏర్పాటుకు ఆదేశాలిచ్చింది. ఇదంతా ప్రత్యక్ష ప్రసారమైంది. కాగా, ధర్మాసనం ఏర్పాటుపై తదుపరి సీజేఐ నిర్ణయం తీసుకుంటారని జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. ప్రస్తుతం ఈ కేసు నాలుగు వారాలకు వాయిదాపడింది.
రాజకీయ పార్టీలు ఇచ్చే ఉచిత హామీల కిందకు ఏం వస్తాయి.. ఏం రావో తేల్చడం చాలా కష్టంగా మారుతోందని మునుపటి విచారణలో సుప్రీంకోర్టు అభిప్రాయపడిన సంగతి తెలిసిందే. ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు హామీలు ఇవ్వకుండా అడ్డుకోలేమని తెలిపింది. ఈ ఉచిత హామీల అంశాన్ని తేల్చేందుకు ఓ కమిటీ వేయాలనుకుంటున్నట్లు వెల్లడించింది
No comments:
Post a Comment