ప్రస్తుత కాలానికి పౌష్టికాహారం పిల్లలకు చాలా అవసరం అని తెలిపిన డాక్టర్ ప్రమీలమ్మ - స్వర్ణముఖి న్యూస్

 స్వర్ణముఖి న్యూస్

NEWS

Breaking

Home Top Ad

Post Top Ad

Thursday, August 11, 2022

ప్రస్తుత కాలానికి పౌష్టికాహారం పిల్లలకు చాలా అవసరం అని తెలిపిన డాక్టర్ ప్రమీలమ్మ

 ప్రస్తుత కాలానికి పౌష్టికాహారం పిల్లలకు చాలా అవసరం అని తెలిపిన డాక్టర్ ప్రమీలమ్మ




స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :


తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్నంలోని కొండమిట్ట మునిసిపల్ ప్రాథమిక పాఠశాల యందు స్టేప్స్ సంస్థ పథక సంచాలకులు డాక్టర్ ప్రమీలమ్మ గారిచే విద్యార్థులకు  ఈ కాలంలో సంభవించే మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ గురించి అవగాహన కల్పించడం జరిగింది. తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించడం జరిగింది. కాచి చల్లారిన నీటిని  ఎక్కువ తీసుకోవడం, దోమతెర లు వాడటం, పరిసరాల లో నీరు నిలువ లేకుండ చూడటం లాంటివి  చేయటం ద్వారా ఈ జబ్బులను అరికట్టగలమని తెలిపారు. తదనంతరం పిల్లలకు మంచి ఎదుగుదలకు బలవర్థకమైన ప్రోటీన్, విటమిన్, ఐరన్ పౌడర్ లను 50మంది విద్యార్థులకు ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం లో హెడ్ మాస్టర్ వేణు, టీచర్ ప్రసుాన, సెక్రటరీ నితిన్, సంస్థ సిబ్బంది రమేష్, గాయత్రి, భాస్కర్ పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Blog Archive

Post Bottom Ad