డీజిల్ ,పెట్రోల్, వంట గ్యాస్, వంటనూనె అంశాలపై కాంగ్రెస్ పార్టీ ఆఫీసు ముందు నిరసన - స్వర్ణముఖి న్యూస్

 స్వర్ణముఖి న్యూస్

NEWS

Breaking

Home Top Ad

Post Top Ad

Saturday, August 6, 2022

డీజిల్ ,పెట్రోల్, వంట గ్యాస్, వంటనూనె అంశాలపై కాంగ్రెస్ పార్టీ ఆఫీసు ముందు నిరసన

 డీజిల్ ,పెట్రోల్, వంట గ్యాస్, వంటనూనె  అంశాలపై  కాంగ్రెస్ పార్టీ ఆఫీసు ముందు నిరసన 



స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :


ఈరోజు ఏఐసీసీ పిలుపుమేరకు కేంద్రంలో మోదీ గారి ప్రభుత్వం చేస్తున్న అకృత్యాలను పెంచిన డీజిల్ ,పెట్రోల్, వంట గ్యాస్, వంటనూనెలు తదితర అంశాలపై శ్రీకాళహస్తి నియోజకవర్గఇంచార్జ్ మరియు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అయిన డాక్టర్. ఎస్ .బతైయ్య నాయుడు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఆఫీసు ముందు నిరసనలు చేయడం జరిగింది.

        ఈ సందర్భాన్ని పునస్కరించుకొని డాక్టర్. బతైయ్య నాయుడు మాట్లాడుతూ దేశాన్ని ఆర్థికంగా దివాలా తీస్తున్నారని, సామాన్య ప్రజలు అల్లాడిపోతున్నారని వారం రోజుల క్రితం పాలు, పెరుగు ,ఐస్ క్రీమ్ తదితర అంశాలపై 5% జీఎస్టీ వేయడం చాలా దుర్మార్గమని, జీఎస్టీ లో వచ్చే దాదాపు చాలా డబ్బులను కార్పొరేట్ సంస్థలకు ధారా దత్తం చేస్తున్నారని ,కార్పొరేట్ సంస్థలకు ఊడిగం చేస్తున్నారని,  మోదీ గారి దుర్మార్గపు పాలనలో ప్రతిపక్షాల మీద ఈడిని, ఇన్కమ్ టాక్స్ ను, సిబిఐ ను ,తదితర సంస్థలను ఉపయోగించి ప్రతిపక్షాలను అణిచి వేస్తున్నారని ఇదే మోడీ గారు గాంధీ కుటుంబం మీద కాంగ్రెస్ పార్టీ మీద కక్షపూని అనగతుకే కక్షతో ముందుకు పోతున్నారని రాహుల్ గాంధీ సోనియా గాంధీ గార్ల మీద ఈడిని ప్రయోగించి ఇబ్బందులకు గురి చేస్తున్నారని ధ్వజమెత్తారు. యంగ్ ఇండియా ఆఫీసు మీద ఈడి దాడి చేసి ఆఫీసుకు తాళాలు వేయడం జరిగింది. అంతేకాకుండా ఏఐసీసీ ఆఫీసు నందు పోలీసులను మోహరించడం జరిగినది.

            మోదీ గారు అనేక ప్రభుత్వ సంస్థలను ఎల్.ఐ.సి, రైల్వే, ఎయిర్పోర్ట్స్ ,వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ, అదేవిధంగా ఫోర్ట్లను కార్పొరేట్ సంస్థలకు ముఖ్యంగా అదాని, ముఖేష్ అంబానీ ,మరియు విదేశీ పెట్టుబడిదారులకు, దారా దత్తం చేస్తున్నారని డాక్టర్ .ఎస్ .బతైయ్య నాయుడు ప్రజలను ఉద్దేశించి ద్వియబట్టారు. కాబట్టి రాబోయే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

       ఈ కార్యక్రమంలో: పట్టణ అధ్యక్షుడు: టి .శివకుమార్, కాంగ్రెస్ నాయకులు :ఎస్కే. జానీ భాష ,బి .విజయ శేఖర్, శెట్టిపల్లి. శివయ్య ,ఎస్. నాగూర్ అయ్యా, రాఘవరెడ్డి, మోహన్, ఎల్లయ్య, బానమ్మ ,వానమ్మ, మస్తానమ్మ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Blog Archive

Post Bottom Ad