MGM ఉచిత మెగా వైద్య వైద్యశిబిరం
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
శ్రీకాళహస్తి MGM హాస్పిటల్స్ మరియు హిందూస్తాన్ కోకాకోలా బేవరేజెస్ ప్రైవేట్ లిమిటెడ్, SEARCHవారు సంయుక్తం గా తొండమనాడు లో నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరానికి విశేష స్పందన. శ్రీకాళహస్తి కోకాకోలా బేవరేజెస్ వారి ఆధ్వర్యంలో MGM హాస్పిటల్స్ వారు తొండమనాడు లో నిర్వహించిన మెగా వైద్యశిబిరం లో దాదాపు 200 మంది హాజరై వారి ఆరోగ్య సమస్యలకు ఉచితంగా సలహాలు మరియు కావలసిన మందులు తీసుకున్నారు. ఈ మెగా వైద్య శిబిరంలో కోకా కోలా బేవరేజెస్ వారి సిబ్బంది పాల్గొని రోగులకు కావలసిన అన్ని సదుపాయాలను పర్యవేక్షించారు. MGM హాస్పిటల్స్ ఆధ్వర్యంలో డాక్టర్ వివేక్ చైతన్య గారు ( గుండె వైద్యనిపుణులు ), డాక్టర్ హరీష్ గారు (ఎముకల సంబంధిత వైద్య నిపుణులు ), డాక్టర్ తేజస్విని గారు (జనరల్ మెడిసిన్ ), డాక్టర్ దేవేంద్ర గారు (ఎమర్జెన్సీ, క్రిటికల్ కేర్ ) వివిధ విభాగాల సంబంధిత డాక్టర్ లు పాల్గొని వైద్య సేవలు అందించారు. ఈ వైద్య శిబిరం లో రక్త పరీక్షలు, షుగర్ పరీక్షలు, ఇ.సి.జి పరీక్షలు ఉచితం గా చేశారు. ఈ కార్యక్రమం లో MGM హాస్పిటల్స్ డైరెక్టర్ గుడ్లూరు మయూర్ మాట్లాడుతూ శ్రీకాళహస్తి చుట్టు ప్రక్క గ్రామాల ఆరోగ్య దృష్ట్యా ఎన్నో ఉచిత ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తున్నామని ఇప్పుడు కోకా కోలా బేవరేజెస్ వారి ఆసక్తి మేరకు తొండమనాడు గ్రామంలో వైద్య శిబిరం నిర్వహించడం ఆనందంగా గా ఉందని తెలిపారు. అలాగే రాబోయే రోజుల్లో ఇలాంటి వైద్య శిబిరాలు ఎన్నో నిర్వహిస్తామని, MGM హాస్పిటల్ లో 24 గంటలు అత్యవసర సేవలు అందుబాటులో ఉన్నాయని ప్రతి ఒక్కరు మీ అవసరతలను బట్టి మా సేవలు వినియోగించుకొనగలరని తెలిపారు.
No comments:
Post a Comment