సామాను శ్రీధర్ రెడ్డి(SSR) దాతృత్వం
సుకన్య సమృద్ధి యోజనకు రూ.2.50లక్షల విరాళం
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
ప్రముఖ సంఘ సేవకులు, సామాను శ్రీధర్ రెడ్డి(SSR) తన దాతృత్వాన్ని సేవా గుణాన్ని మరోసారి చాటుకున్నారు. శ్రీకాళహస్తి, కేవీబీపురం, బుచ్చినాయుడుకండ్రిగ మండలాలకు సంబంధించి సుకన్య సమృద్ధి యోజన పథకం కింద గురువారం మొదట కంతుగా ఆయన ఒక్కో బాలికకు రూ.250వంతున వెయ్యి మందికి రూ.2.50లక్షలు చెల్లించి తన దయా గుణాన్ని చాటుకున్నారు. ఈ సొమ్మును శ్రీకాళహస్తి పోస్టల్ ఇన్స్ పెక్టరు మణిగండన్ కు అందజేశారు. సుకన్య యోజనకు రూ.2.50లక్షలు అందజేసిన సామాను శ్రీధర్ రెడ్డిని పోస్టాఫీసు అధికారులతో పాటు బాలికల తల్లిదండ్రులు అభినందించారు. ఆయనకు కృతజ్ఞతలు తెలియచేశారు. క్రీడాకారులను ప్రోత్సహించడం లోనూ పేదలకు దానం చేయడంలో సామాను శ్రీధర్ రెడ్డికి సాటి ఎవరూ రారని వారు ఈ సందర్భంగా కొనియాడారు. ఈయనకు శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని వారు కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో కిరణ్, వాసుదేవ, అనుత రాజు పాల్గొన్నారు.
No comments:
Post a Comment